కెరీర్ కెరీరే.. లవ్ లవ్వే... ఎంజాయ్..ఎంజాయే... ఇదే సూత్రాన్ని ప్రస్తుతం సమంత పాటిస్తోంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరో పక్క ప్రేమికుడు నాగచైతన్యతో ఎఫైర్ నడుపుతోంది. మరోవైపు పెళ్లికాకముందు నుండే అక్కినేని ఫ్యామిలీతో రిలేషన్‌షిప్ మెయిన్‌టెయిన్ చేస్తోంది. అక్కినేని ఫ్యామిలీకి చెందినదిగా పలు ఫంక్షన్లకు హాజరవుతోంది. ఇక ఇదే దారిలో ప్రస్తుతం నయనతార కూడా నడుస్తోంది. ఇప్పటికే శింబు, ప్రభుదేవాలతో ఎఫైర్ నడిపినా అది పెళ్లివరకు రాలేదు. కాగా ప్రస్తుతం నయన తమిళ దర్శకుడు విఘ్నేష్‌శివన్‌తో ప్రేమాయణం నడుపుతోంది. ఇటీవలే ఆమె విఘ్నేష్ శివన్ తల్లికి మంచి పార్టీ ఇచ్చింది. తన ఇంటికి ఆమెను ఆహ్వానించి మరీ తనే పికప్ చేసుకొని తన ఇంటికి తీసుకెళ్లి వ్యక్తిగత విషయాలను గూర్చి కూడా విఘ్నేష్‌శివన్ తల్లితో అన్ని కలిసి పంచుకుంది. అదే సమయంలో ఆమె ప్రస్తుతం అరడజన్ చిత్రాలతో బిజీ బిజీగా ఉంది. ఈ చిత్రాలతో బిజీగా ఉంటూనే, మరోపక్క తన వ్యక్తిగత విషయాలకు కూడా బాగానే సమయం కేటాయిస్తోంది. కాగా త్వరలో ఆమె కార్తి సరసన 'కాష్మోరా'లో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం లుక్స్, ట్రైలర్స్ అదిరిపోయే రేంజ్‌లో ఉన్నాయి. ఈ చిత్రం దీపావళి కానుకగా తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో కార్తికి జోడీగా నయనతార, శ్రీదివ్యలు నటిస్తున్నారు. మొత్తానికి సమంత ఎంచుకున్న రూట్‌లోనే ప్రస్తుతం నయన కూడా నడుస్తోందని మీడియాలో ఈ ఇద్దరిని పోలుస్తూ కథనాలు వస్తున్నాయి.