పూరీజగన్నాద్ చిత్రమంటే ఒకప్పుడు హీరోలు పోకిరిగా, బాధ్యతారాహిత్యంగా తిరిగే జులాయిలుగా కనిపించేవారు. కానీ 'బిజినెస్‌మేన్' నుంచి పూరీ స్టైల్ మారింది. మొత్తానికి పూరీ హీరోలు ఈ మద్యకాలంలో బాధ్యతావంతులుగా కనిపిస్తున్నారు. సినిమా మొదటి భాగంలో జులాయిలుగా కనిపించినా సెకండాఫ్ కల్లా బాధ్యతనెరిగిన వ్యక్తులుగా సమాజసేవ, అవినీతిని అంతం చేసే భాధ్యతాయుతులుగా మారుతున్నాను. 'బిజినెస్‌మేన్, టెంపర్' తాజాగా 'ఇజం' చిత్రంలో కూడా హీరోలు అవినీతి, అన్యాయాలపై పోరాటం సాగిస్తారు. అయినా అది కూడా పూరీ స్టైల్‌లోనే సుమా...! 'ఇజం' చిత్రంలో ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్, 'టెంపర్'లో కూడా కోర్టు సీన్ వంటివి పూరీలోని మార్పును సూచిస్తున్నాయి. మొత్తానికి ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ను కూడా డిఫరెంట్‌గా ప్రజెంట్ చేసిన పూరీపై ఆయన అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. 'నేనింతే' చిత్రంలో జర్నలిస్ట్‌లపై, మీడియాపై తన అక్కస్సును వెల్లగక్కిన పూరీ ఎట్టకేలకు 'ఇజం' చిత్రంలో జర్నలిజాన్ని కొత్త కోణంలో చూపించాడు. ఇక ఇటీవల ఇంటర్వ్యూలో ఆయన తన మహేష్‌బాబు సినిమా గురించి మాట్లాడుతూ, మన స్టార్స్ సినిమా చేద్దామంటారు కానీ ఎప్పుడు చేస్తారో చెప్పరు. వారిని నమ్ముకుంటే జీవితం గడిచిపోతుంది. ఎవరు డేట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా సినిమాలు తీస్తూ పోవడం నా నైజం.. అంటూ ఇన్‌డైరెక్ట్‌గా పూరీ మహేష్‌పై వేసిన కౌంటర్ ఇప్పుడు అన్ని చోట్లా ఆసక్తికరమైన అంశంగా మారింది.