సినిమా వాళ్లకి ముఖ్యంగా కొంత ఇమేజ్ వస్తే చాలు అలా ప్రకటనల్లో దూసుకుపోతుంటారు. అలా వారికి మంచి ప్రచారంతో పాటు సంపాదన కూడా గిట్టుబాటవుతుంది. సినిమా వాళ్ళేకాదు కాస్త పేరుమోసిన ప్రతివారూ ఆయా ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా చెలరేగిపోతున్న కాలంలో మనం ఉన్నాం. నిన్నటికి మొన్న స్టార్ ఇమేజ్ కైవసం చేసుకున్న పివి సింధు కోట్ల రూపాయలు కేవలం ప్రకటనల ద్వారానే ఆర్జిస్తున్న విషయం తెలిసిందే. అలా డబ్బు కోసం చేసే ప్రకటనలు అప్పుడప్పుడు ఇబ్బందులను కూడా తెచ్చిపెట్టడం మనం చూస్తుంటాం. ఇప్పుడు అదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు మన బల్లాలదేవుడు అయిన యంగ్ హీరో రానా మరియు గొప్ప నటుడు ప్రకాష్ రాజ్. వీరిద్దరూ కలిసి ఓ ఆన్ లైన్ గేమ్ కు యాడ్ లో నటించడంతో, దానిపై తాజాగా ఓ కేసు నమోదైంది.
అంతర్జాతీయ స్థాయిలో పేరుగడించిన బాహుబలి సినిమా నటుడు రానా, ప్రకాష్ రాజ్ తో కలిసి జంగిల్ రమ్మీ గేమ్ కు సంబంధించిన యాడ్ లో నటించారు. వీరిద్దరూ పలు వెబ్ సైట్ల ద్వారా, ప్రకటనల ద్వారా రమ్మీని ఆడేలా పురిగొల్పుతున్నారని వీరిపై కేసు నమోదైంది. ఇదిలా ఉండగా అసలు రానాకు ఎందుకీ తలకాయ నొప్పి, ఏదో బాబాయ్ వెంకటేష్ లా ముత్తూట్ ఫైనాన్స్ లాంటి వాటిల్లో ప్రకటనలు చేసుకోక దీంట్లో వేలెందుకు పెడుతున్నాడు అంటూ రానా పై సెటైర్ల్ కూడా వేస్తున్నారు నెటిజన్లు. ఈ కేసు పై రానా, ప్రకాష్ రాజ్ లు ఎలా స్పందిస్తారో చూడాలి.