కేసీఆర్ ప్రభుత్వ పనితీరు అద్భుతం, అపూర్వం అంటూ 'సెంటర్ ఫర్ సెఫాలజీ ' సర్వే చేసి తేల్చి రిపోర్ట్ ఇచ్చిన రోజే ఒక బిల్ కలెక్టర్ ఆరు కోట్ల అక్రమసంపాదనను హైదరాబాద్ లో ఏసీబి వెలికితీసింది. బిల్ కలెక్టర్ అవినీతి చూసి అంతా ఆశ్చర్యపోయారు. తెరాస ప్రభుత్వంలో చిన్న ఉద్యోగుల అక్రమ సంపాదన ఏ విధంగా ఉంటుందో తేలింది. అవినీతి రహిత పాలన అందిస్తామన్న నేతల హామీలు నీటి బుడగలే అని తేలింది. ఇంతటి అవినీతి జలగలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పాలనకు ప్రజలు ఎలా అనుకూలంగా స్పందించారనేది అనుమానించాల్సిన విషయం. పైగా ఏసిబికి దొరికిన సదరు బిల్ కలెక్టర్ సిద్దిపేట జిల్లా వాసి కావడం విశేషం. జిహెచ్ ఎంసిలో ఇలాంటి అవినీతి జలగలు ఇంకా అనేకం ఉన్నాయనే ఆరోపణలున్నాయి.