ప్రముఖ టాలీవుడ్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లాలోని హిందూపురంలో పర్యటించాడు. అక్కడ తన నియోజకవర్గమైన హిందూపురం చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇంకా హిందూపురం సమీపంలో గల గుడ్డం రంగనాథ స్వామి ఆలయంలోని కోనేరు అభివృద్ధి నిమిత్తం శంకుస్థాపన చేశాడు బాలకృష్ణ.
నందమూరి బాలకృష్ణ ఇక్కడకి చేరుకొని మాట్లాడుతూ.. నాన్నగారు స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తాను అనంతపురంని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా బాలకృష్ణ వివరించాడు. ఇంకా బాలకృష్ణ స్పందిస్తూ... హిందూపురంను నందమూరిపురంగా ఆయన అభివర్ణించాడు. అయితే గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు హిందూపురం నియోజక వర్గం నుండే పలుమార్లు అసెంబ్లీకి ఎన్నికైన విషయం తెలిసిందే.