Advertisementt

బిగ్ బి కోసం బాలయ్య వెళ్ళింది ఇందుకేనా?

Sat 22nd Oct 2016 01:43 PM
balakrishna,raitu movie,amitabh bachchan,krishna vamsi,sarkar 3 sets  బిగ్ బి కోసం బాలయ్య వెళ్ళింది ఇందుకేనా?
బిగ్ బి కోసం బాలయ్య వెళ్ళింది ఇందుకేనా?
Advertisement
Ads by CJ

బాలకృష్ణ రెండురోజుల క్రితం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ ని ముంబై లో సర్కార్ 3  సినిమా సెట్స్ లో కలిసిన విషయం తెలిసిందే. ఇక రెండు రోజులుగా బాలకృష్ణ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ ని ఎందుకు కలిసాడు... అనే విషయం పై చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. బాలకృష్ణ తన 101 చిత్రం కృష్ణవంశీ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసమే బాలకృష్ణ అమితాబ్ ని కలిసాడని టాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ 101 చిత్రం లో బాలయ్య కి తండ్రిగా అమితాబ్ నటిస్తాడని వార్తలొస్తున్నాయి. ఇక బాలకృష్ణ ఎందుకు కలిశాడా అన్నది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు.

అయితే ఇప్పుడు మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే బాలకృష్ణ తన 101 వ చిత్రం కృష్ణవంశీ తో చేస్తానని ఎప్పుడో ప్రకటించాడు. ఈ సినిమాలో బాలయ్య పాత్ర చాలా పవర్ ఫుల్ గా వుంటుందట. అలాగే మంచి ప్రాధాన్యత, పవర్ ఫుల్ కలిసిన పాత్ర కూడా మరొకటి ఈ సినిమాలో ఉందట. అయితే ఈ పాత్రకి బాలీవుడ్ బిగ్ బి అయితే బావుంటుందని డైరెక్టర్ కృష్ణ వంశీ బాలయ్యకి చెప్పగా..... దీనికి బాలకృష్ణ కూడా సరే అని ఆయనకున్న పాత పరిచయంతో అమితాబ్ ని కలవడానికి కృష్ణవంశీ తో సహా ముంబై వెళ్ళాడట. ఇక అక్కడ జరిగిన మీటింగ్ కి సంబందించిన మేటర్ అయితే బయటికి రాలేదుగాని ఫొటోస్ మాత్రం సోషల్ మీడియా లో వైరల్ లా మారాయి. ఇంకేముంది ఎవరిష్టం వచ్చినట్లు వారు కథలు అల్లేశారు. ఇక ఈ ఫొటోల్లో బాలకృష్ణ ని అమితాబ్ ఆలింగనం చేసుకోగా.. బాలకృష్ణ అమితాబ్ కాళ్ళకి దణ్ణం పెట్టడం ఆ ఫొటోస్ లో కనిపించాయి. ఇక డైరెక్టర్ కృష్ణ వంశీ బాలయ్య 101 చిత్రం గురించి అందులోని అమితాబ్ పాత్ర గురించి వివరించగా ఆ స్టోరీ పెద్దాయనకి నచ్చి ఓకె చేసాడని అంటున్నారు. 

ఇక కథతో పాటు బాలకృష్ణ.. ఎన్టీఆర్ కి కొడుకు కూడా అవ్వడం తో ఆ అభిమానం తోనే ఈ సినిమాలో చెయ్యడానికి అమితాబ్ ఒప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమా కోసం బిగ్ బి 17 రోజుల పాటు డేట్స్ కేటాయించినట్లు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ, అమితాబ్ కలిసి నటిస్తే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడి రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుందని నందమూరి అభిమానులతో పాటు అందరూ అనుకుంటున్నారు. మరి ఫైనల్ గా ఈ వార్త అయినా నిజమేనా? లేక ఇది కూడా రూమరా? అనేది మరికొన్ని రోజుల్లో తెలిసి పోతుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ