Advertisementt

కీర్తి సురేష్ కి ఈ వరాలేంటో!

Fri 21st Oct 2016 11:33 PM
keerthi suresh,vignesh sivan,suriya,keerthi suresh busy with movies  కీర్తి సురేష్ కి ఈ వరాలేంటో!
కీర్తి సురేష్ కి ఈ వరాలేంటో!
Advertisement
Ads by CJ

ఈ ఏడాది ప్రారంభం వరకు హీరోయిన్‌ కీర్తిసురేష్‌ అంటే కేవలం మలయాళ చిత్ర పరిశ్రమకు మాత్రమే తెలుసు. కానీ ఈ ఏడాది ఆమె నటించిన తెలుగుచిత్రం 'నేను శైలజ', తమిళంలో 'రజనీమురుగన్‌' చిత్రాలతో ఆమె ఇప్పుడు సౌత్‌లో తోటి స్టార్‌హీరోయిన్లకు సవాల్‌ విసురుతోంది. అదే సమయంలో ఆమె గ్లామర్‌షోను పక్కనపెట్ది తనకు కూడా నటనా ప్రతిభ చూపించడానికి అవకాశం ఉన్న చిత్రాలనే ఒప్పుకొంటోంది. ఈ ప్రక్రియలో భాగంగా ఆమె మహేష్‌ -మురుగదాస్‌ల చిత్రంతో పాటు మరికొన్ని ఆఫర్స్‌ను తిరస్కరించింది. ప్రస్తుతం ఆమె నాని సరసన 'నేనులోకల్‌' చిత్రంలో నటిస్తోంది. ధనుష్‌తో కలిసి ఇప్పటికే ఆమె ఓ చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె విజయ్‌ సరసన 'భైరవ' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. మరోపక్క తెలుగు, తమిళ బాషల్లో అల్లుఅర్జున్‌ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందనున్న భారీ ద్విభాషా చిత్రం ఓకే చేసింది. తాజాగా ఆమెకు మరో సూపర్‌ ఆఫర్‌ లభించింది. సూర్య హీరోగా విఘ్నేష్ శివన్‌ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మొత్తానికి గ్లామర్‌షోకు దూరంగా ఉన్నప్పటికీ ఆమెకు ఇలాంటి వరస ఆఫర్లు వస్తుండటంతో ఆమె ప్రస్తుతం టాప్‌హీరోయిన్లకు పెద్ద పోటీగా తయారయింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ