ఒకప్పుడు కామెడీ హీరోలంటే రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేష్, చంద్రమోహన్ వంటి హీరోల చిత్రాలు మంచి సక్సెస్‌ను సాదించేవి. కానీ రాజేంద్రప్రసాద్ తర్వాత ఆ స్థాయి హీరోగా ఎవ్వరూ నిలబడలేకపోయారు. కానీ కామెడీ హీరోగా అల్లరినరేష్, కమెడియన్ స్దాయి నుండి హీరోగా మారిన సునీల్ కామెడీ జోనర్ చిత్రాలలో నిలబడతారని... హాస్యప్రియులను అలరిస్తారనే నమ్మకం కలిగించారు. అల్లరినరేష్‌కు 'సుడిగాడు' తర్వాత మరో సక్సెస్ రాలేదు. ఆయన నటించిన చిత్రాలన్నీ ఎప్పుడు వస్తున్నాయో.. ఎప్పుడు పోతున్నాయో కూడా తెలియడం లేదు. ఇక సునీల్‌కు 'పూలరంగడు' తర్వాత ఫ్లాప్‌లలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయన నటించిన చిత్రాలన్నీ విడుదలకు ముందు ఆసక్తిని కలిగించినా విడుదలైన తర్వాత మాత్రం తేలిపోతున్నాయి. కాగా ప్రస్తుతం అల్లరినరేష్ 'ఇంట్లో దెయ్యం... నాకేం భయం' చిత్రం చేస్తున్నాడు. జి. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇక ఇటీవలే 'ఈడు గోల్డ్ ఎహే' చిత్రంలో నటించిన సునీల్ ఈ చిత్రాన్ని చేసి గోల్డ్ కాదు కదా..! రోల్ గోల్డ్ అని చెడ్డపేరు తెచ్చుకున్నాడు. మరోవైపు సునీల్ ప్రస్తుతం 'ఓనమాలు' డైరెక్టర్ క్రాంతిమాధవ్ తో 'ఉంగరాల రాంబాబు' అనే చిత్రం చేస్తున్నాడు. మొత్తానికి ప్రస్తుతం అల్లరినరేష్, సునీల్‌లు తీవ్ర ఇబ్బందికర పరిస్దితుల్లో ఉన్నారని అర్దమవుతోంది.