Advertisementt

అవన్నీ అవాస్తవాలేనంటోన్న కళ్యాణ్ రామ్.!

Fri 21st Oct 2016 03:28 PM
ism interview,ism kalyan ram. kallyan ram clarification,ism director puri jagannath  అవన్నీ అవాస్తవాలేనంటోన్న కళ్యాణ్ రామ్.!
అవన్నీ అవాస్తవాలేనంటోన్న కళ్యాణ్ రామ్.!
Advertisement
Ads by CJ
ఇజం సినిమా హీరో కం ప్రొడ్యూసర్ నందమూరి కళ్యాణ్ రామ్ ఇన్నాళ్ళ పట్టి తనపై వస్తున్న రూమర్లపై స్పందించాడు. ఇజం సినిమాకు అమితంగా డబ్బు ఖర్చు పెట్టాడని, అయితే అనుకున్నంత బిజినెస్ చేయలేదని ఇలా కళ్యాణ్ రామ్ కు దెబ్బమీద దెబ్బ తుగులుతుందని ఈ మధ్య తెగ వార్తల్ హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ ఇంటర్వ్యూ సందర్భంలో  ఈ విషయాలపై స్పందించాడు. నిజంగా తాను అంతగా అప్పుల్లో ఏం కూరుకుపోలేదని, ఇజం సినిమాకు కాస్త ఇంచుమించుగా డబ్బులు ఖర్చుపెట్టినా బిజినెస్ బాగా చేసిందని వెల్లడించాడు. ఈ మధ్య కాలంలో తనపై, తన సినిమా బిజినెస్ పై వస్తున్న వార్తలు గాలివార్తలుగా కొట్టిపారేశాడు కళ్యాణ్ రామ్. కాగా అంత ఎక్కువ మొత్తంలో ఇజం సినిమాకు ఖర్చు పెట్టలేదని, అనుకున్నంతలోనే ఇజం సినిమా నిర్మించామని వివరించాడు కళ్యాణ్ రామ్. 
ఇంకా కళ్యాణ్ రామ్ ని సొంత బ్యానర్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారని అడుగగా.. అదేం లేదు, కథంటూ... డైరెక్టర్ వచ్చి చెప్పినప్పుడు ఆ కథ నచ్చడం, తన బ్యానర్ లోనే ఆ సినిమా చేస్తే పోలా అంటూ.. అలా సిద్ధపడి సినిమాలు ఎక్కువ చేయడం జరిగిందని, ఇకపై ఇతరుల బ్యానర్లలో కూడా సినిమాలు చేస్తానని తనదైన శైలిలో కళ్యాణ్ రామ్ స్పందించాడు. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ