Advertisementt

కేథరిన్ టెక్కులు తగ్గించుకుంటే బెటర్!

Thu 20th Oct 2016 08:16 PM
catherine tresa,khaidi no 150,allu arjun,sarainodu,teja,rana daggubati  కేథరిన్ టెక్కులు తగ్గించుకుంటే బెటర్!
కేథరిన్ టెక్కులు తగ్గించుకుంటే బెటర్!
Advertisement
Ads by CJ

సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా నటించిన కేథరిన్ థెరిస్సా.... ఆ సినిమాలో యంగ్ ఎమ్యెల్యేగా మార్కులు కొట్టేసింది. అంతకుముందు కూడా ఆమె అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలు సినిమాలో నటించింది. అయితే కేథరిన్ కి మాత్రం సెకండ్ హీరోయిన్ గానే  అన్ని సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి కానీ సింగిల్ గా మాత్రం ఛాన్స్ కొట్టలేక చతికల పడుతుంది. ఇక సరైనోడు లో ఆమె నటన కు మెచ్చి చాలా  ఆఫర్స్ ఆమె తలుపు తట్టాయి కానీ సరైన అవకాశం మాత్రం రాలేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150 లో స్పెషల్ సాంగ్ కి  ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారింది. దానికి పూర్తి తప్పిదం కేథరిన్ దే అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ ఆఫర్ అయితే చేజారింది కానీ అమ్మడికి తేజ డైరెక్షన్లో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో ఆమె రానాకీ జోడిగా నటించనుందని సమాచారం. ఇక సరైనోడు సినిమాలో లాగే ఈ సినిమాలో కూడా ఆమె పొలిటీషియన్ గా నటించబోతుందని సమాచారం. ఇప్పటికే ఎమ్యెల్యేగా సరైనోడు లో మెప్పించిన కేథరిన్ ఈ సినిమాలో కూడా పొలిటీషియన్ గా మెప్పించగలదనే ఆశతో తేజ ఈ పాత్ర ఆమెకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ డైరెక్టర్ తో ఆమె సినిమా ఒప్పుకోవడానికి కారణం మాత్రం ఈ సినిమాలో కేథరిన్ రోల్ కొంచెం డిఫరెంట్ గా ఉండడమే అంట. అందుకే ఆమె వెంటనే ఒప్పేసుకుందని అంటున్నారు. అసలే సరైన అవకాశం లేక ఖాళీగా ఉంటున్న కేథరిన్ ఈ అవకాశాన్ని అదృష్టం గా భావించక ఏదో బావుంది కదా అని ఒప్పుకున్నానని డైలాగ్స్ కొట్టటం కొంచెం వింతగానే వుంది కదూ! ఇలాంటి టెక్కులు పొతే..ఇది కూడా పోవడం ఖాయమని అమ్మడు ఇకనైనా గమనిస్తే బెటర్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ