Advertisementt

నెటిజన్లందరికీ రెజీనా షాక్..!

Thu 20th Oct 2016 06:01 PM
regina cassandra,twitter in regina cassandra,new tamil movie in regina cassandra,manchu manoj tweet on regina cassandra,netigens shocked tweet on regina cassandra  నెటిజన్లందరికీ రెజీనా షాక్..!
నెటిజన్లందరికీ రెజీనా షాక్..!
Advertisement
Ads by CJ
టాలీవుడ్ లో చేతినిండా సినిమాలతో చాలా బిజీబిజీగా ఉన్న హీరోయిన్ రెజీనా కాసాండ్ర. కొంచం కూడా తీరిక లేకుండా హడావుడిగా షూటింగ్ లకు పరుగులిడుతున్న ఈ భామ తాజాగా తన అభిమానులందరికీ షాక్ ఇచ్చినంత పని చేసింది. ఈ అమ్మడు ట్వట్టర్ ద్వారా వెడ్డింగ్ బెల్స్.. మీ ఆశీస్సులు అందించండి అంటూ ఏకంగా తన ఫోటోను పెట్టేసింది రెజీనా. అంతే ఒక్కసారిగా రెజీనా అభిమానులు, శ్రేయోభిలాషులు కంగారు పడిపోయి.. కొంచం అలోచించి రెజీనాకు నిజంగా పెళ్ళా.. లేక సినిమా ప్రమోషన్ లో  భాగమా అంటూ వీరంతా ఆలోచనలు మొదలెట్టేశారు. మంచు మనోజ్ అయితే ఏకంగా కంగ్రాట్స్ మచ్చి,... ఇక ఇది పార్టీ టైమ్ అంటూ హడావుడిగా ట్వీట్ చేశాడు.
దాంతో టాలీవుడ్ అంతా రెజీనా పెళ్ళి చేసుకోబోతుందంటూ చర్చించుకోసాగారు. నిజంగా ఈ సమయంలో రెజీనా చేతినిండా సినిమాలు పెట్టికొని పెళ్ళి ఎలా చేసుకుంటుందబ్బా అంటూ పరిశ్రమ పెద్దల్ని కూడా ఆలోచనలోకి నెట్టేసింది. ఇలా ఎవరి ఊహాలోకంలో వారు విహరిస్తుండగా చల్లటి కబురు అన్నట్లు రెజీనా ఇలా చెప్పింది. తాజాగా రెజీనా జమినీ గణేషన్ సూరులి రాజనణ్ అనే చిత్రంలో నటిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ ఫోటోను ఈ భామ  ట్విట్టర్ లో పెట్టి, ప్రమోషన్ లో భాగంగా అల్లా చెప్పాల్సి వచ్చిందని వెల్లడించి అభిమానులను సైతం తికమక పెట్టింది ఈ అందాల భామ రెజీనా కాసాండ్ర.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ