Advertisementt

బిగ్ బిని కలవాల్సిన అవసరం బాలయ్యకేంటి?

Thu 20th Oct 2016 05:36 PM
balakrishna,gautamiputra satakarni,big b,sarkar 3 sets,balakrishna meets amitabh bachhan  బిగ్ బిని కలవాల్సిన అవసరం బాలయ్యకేంటి?
బిగ్ బిని కలవాల్సిన అవసరం బాలయ్యకేంటి?
Advertisement
Ads by CJ

అవునండి బాలకృష్ణ ముంబై వెళ్లి మరీ బిగ్ బి అమితాబచ్చన్ ని కలిసి వచ్చాడు. ఎందుకో ఏమో తెలియదు గాని నిన్న ముంబైలోని సర్కార్ 3  సినిమా షూటింగ్ స్పాట్ లో బాలకృష్ణ అమితాబ్ ని కలిసినట్లు ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ కలిసి ఏవో ముచ్చటించుకున్నట్లు ఉందా ఫోటో. బాలకృష్ణ కి అమితాబ్ ఎప్పటినుండో  తెలుసు కానీ.... వారు ఈ మధ్యన ఎక్కడ మీట్ అవ్వడం గాని మాట్లాడుకోవడం గాని జరగలేదు. మరి ఉన్నట్టుండి బాలయ్యకి అమితాబ్ తో ఏం అవసరమొచ్చిందో గాని ఇప్పుడు ఈ కలయిక మీడియాలో ప్రాధాన్యత సంతరించుకుంది. 

బాలకృష్ణ తన 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నాడు. అక్కడ అమితాబచ్చన్ కూడా తన సర్కార్ 3  సినిమా షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది. మరి ఇంత బిజీ గా వున్న ఈ స్టార్స్ ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకున్నారో అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకిత్తిస్తోందో. వారిద్దరూ కలిసి వున్న ఈ ఫోటో మీ కోసం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ