Advertisementt

ఇక త్రిష మోహిని అస్త్రం ప్రయోగిస్తోంది!

Wed 19th Oct 2016 10:04 PM
trisha,mohini,trisha mohini look,trisha new movie mohini,trisha mohini avatar,maadesh director  ఇక త్రిష మోహిని అస్త్రం ప్రయోగిస్తోంది!
ఇక త్రిష మోహిని అస్త్రం ప్రయోగిస్తోంది!
Advertisement
Ads by CJ

సౌత్ ఇండియన్ సీనియర్ హీరోయిన్ అయిన త్రిష గురించి ఇప్పుడు పరిశ్రమంతా హాట్ హాట్ గా చర్చించుకుంటుంది. అప్పట్లో పెళ్ళి అని హడావుడి చేసి అది కాస్త వెనక్కి వెళ్ళిపోవడంతో మళ్ళీ ఈ భామ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్య త్రిష సినిమాలు అరకొరగా ఆడుతున్నా అందాన్ని ఆరబోయటంలో మాత్రం ఈ బ్యూటీ ఏమాత్రం తగ్గడం లేదు. త్రిష ఈ మధ్య హార్రర్ చిత్రాలైన అరణ్మనై 2, నాయకీ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా అంతగా ఆడకపోయినా మళ్ళీ అదే జోనర్ లో ఈసారి మోహిని అస్త్రం ప్రయోగించబోతుంది!. తాజాగా మోహిని పేరుతో తెరకెక్కుతున్న చిత్రం టైటిల్ పాత్రలో నటిస్తుంది ఈ చెన్నై అందాల భామ. చిత్రబృందం విడుదల చేసిన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పై సినీ పరిశ్రమలో  హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది. అచ్చం మోహినీ అవతారంలో త్రిష దెయ్యాలను చూయించేప్పుడు వాడే స్కిన్ టైట్ డ్రెస్ తో కూడుకొని తలపై కిరీటం పెట్టుకొని, ఎనిమిది చేతులలో ఆయుధాలు ధరించి...చూపరులకు భలే ఈజిప్టు దేవతలా దర్శనమిస్తుంది. 

ఆర్ మాదేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మోహిని చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం లండన్ లో జరిపారు. మోహిని చిత్రం షూటింగ్  చివరి దశలో ఉన్నట్లు చిత్రబృందం ద్వారా తెలుస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ