Advertisementt

భారతీయతనే చాటిన ముఖేష్ అంబానీ..!

Wed 19th Oct 2016 03:34 PM
mukesh ambani,reliance industries director mukhesh ambani,india- pakistan actores  భారతీయతనే చాటిన ముఖేష్ అంబానీ..!
భారతీయతనే చాటిన ముఖేష్ అంబానీ..!
Advertisement

భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం పాకిస్తాన్ నటులకు తంటాలు తెచ్చిందనే చెప్పాలి. పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత జవాన్లపై చేసిన దాడికి నిరసనగా పాకిస్తాన్  నటులు బాలీవుడ్ లో నటించడానికి వీలులేదని, వెంటనే వారికి ఉద్వాసన పలకాలని పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబాని సైతం పాకిస్తాన్ నటులపై చేసిన వ్యాఖ్యలు సంచలం రేపుతున్నాయి. ప్రముఖ పాత్రికేయులు శేఖర్ గుప్తా, బర్ఖాదత్ ఆద్వర్యంలో ది ప్రింట్  నిర్వహించిన ఆఫ్ ది కఫ్ కార్యక్రమంలో  ముఖేష్ అంబానీ  మాట్లాడారు.  తనకు కళలు, సంస్కృతి వీటన్నింటి కన్నా భారతదేశమే ముఖ్యమైందని స్పష్టం చేశాడు.  నేను ఒక విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాను అన్నాడు. తానేమి మేధావిని కాదని అందుకనే ఇలాంటివేవి తమకు అర్థం కావని ఆయన తెలిపాడు. అయితే అందరిలాగా తనూ భారతీయుడను కాబట్టి తాను కూడా దేశ భక్తికే ఓటు వేస్తాను అని ఆయన చాలా స్పష్టంగా మాట్లాడాడు.

అంతేకాకుండా ముఖేష్ అంబానీని రాజకీయాల్లో మీరు చేరే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ... తనకు రాజకీయాలు అంతగా కలిసిరావంటూ వివరించాడు. కాగా సర్జికల్ దాడుల వీటికి సంబంధించి భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ థాకరే  పాకిస్తాన్ నటులు భారత్ విడిచి వెళ్ళిపోవాలంటూ చేసిన వ్యాఖ్యలతో ఈ దుమారం రేగటానికి ఆజ్యం పోసింది.  ఇదిలా ఉండగా పాకిస్టాన్ నటులు నటించిన   యేదిల్ హై  ముష్కిల్ సినిమాను ప్రదర్శించడానికి వీళ్ళేదంటూ  మహారాష్ట్ర, గుజరాత్,కర్ణాటక, గోవా  కు చెందిన  సింగిల్  స్క్రీన్ థియేటర్ యజమానులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కరణ్ జోహార్ కు దిగివచ్చి ఇకమీదట పాకిస్తాన్ నటులతో సినిమాలను చేయనని వెళ్ళడించాడు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement