Advertisementt

పవన్ అంటే ఉలిక్కి పడుతున్న ఆ ఇద్దరు!

Wed 19th Oct 2016 02:34 PM
pawan fever,chandrababu naidu,ys jagan mohan reddy,andhra pradesh politics,special package,janasena  పవన్ అంటే ఉలిక్కి పడుతున్న ఆ ఇద్దరు!
పవన్ అంటే ఉలిక్కి పడుతున్న ఆ ఇద్దరు!
Advertisement
Ads by CJ

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు తలస్తేనే తెలుగు ప్రజా ప్రతినిథులు ఓ రకమైన భయకంపితులు అవుతున్నారు. అదేంటో తెలియదుగానీ పవన్ కళ్యాణ్ తీరును ఒకసారి గమనిస్తే పైకి మాత్రం సమాజం పట్ల, ప్రజల పట్ల అతిసమీప సంబంధం కలిగిన ఎంతో బాధతో కూడిన ఆందోళనతో ఉన్నట్లుగా అగుపిస్తుంటాడు. పవన్ ఎప్పుడు మాట్లాడినా సమాజం, ప్రజా సమస్యలు, నాయకుల తీరుతెన్నుల గురించే రగిలిపోతుంటాడు. అసలెందుకిలా జరుగుతుంది అన్న సమానతా వాదాన్ని ఆయన పోకడలు, వ్యక్తీకరణలు, మాటల తూటాలు ఉంటాయి. నిజంగా పవన్ కళ్యాణ్ కు  సమాజం పట్ల అంత ప్రగాఢమైన బాధ్యత కానీ, ఆందోళన కానీ, అంకితభావంతో ప్రజాకాంక్షలను నెరవేర్చాలన్న తపన గానీ ఉందా? అన్న విషయం ప్రస్తుతం ఇక్కడ ఒకసారి పక్కన పెడదాం.

సహజంగా పవన్ ఏం ఆశించి బహిరంగ సభల్లో సమావేశాల్లో అలా ఆకట్టుకునేలా, అందరిలో ఆలోచనను రేకెత్తించేలా మాట్లాడతాడో తెలియదు గానీ, తను అనుకున్న భావ ప్రకటనను మాత్రం నిర్మొహమాటంగా వెల్లడించడానికి ఏమాత్రం వెరవడు. అదంతా సినిమాల్లో నిత్యం ప్రాక్టీస్ చేసి చేసి అలవడిన లక్షణం కాబోలు. ఎందుచేతంటే పవన్ అన్ని సమస్యలను పరిష్కరించేందుకు, సమస్యపై పోరాడేందుకు ఆయా కార్యక్రమాలను ప్రారంభిస్తాడే గానీ, ఆ తర్వాత ఆచరించే దగ్గరికి వచ్చేసరికి ఏ ఒక్కరికీ కనపడడు, కనీసం వాయిస్ కూడా వినిపించదు అంటుంటారు అంతా. ఏందుకో పవన్ ని ఏ కార్యక్రమమైనా ఆరంభించడంలో శూరత్వాన్ని ప్రదర్శించి ఆచరించడంలో శూన్యత్వానికి చేరుకుంటున్నారన్న అపవాదు వెంటాడుతుంది. తద్వారా పవన్ చేసే విప్లవాత్మకమైన ప్రసంగాలు, సమానతా దృక్పధంతో వెల్లడించే ఉద్రేకపూరిత భావాలు అన్నీ కూడా మాటలకే పరిమితమౌతున్నాయి గానీ చేతల ద్వారా పవన్ చూపడం లేదన్నది సారాంశం.  

ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాలలోని తెలుగు ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ పై ఎనలేని అభిమానాన్ని పెంచుకుంటున్నారన్నది మాత్రం ముమ్మాటికి నిజం. ఆ రకంగా ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకొని ముందుకు పోతున్న ప్రజాప్రతినిధులకు పవన్ అంటే భయమేస్తుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన జగన్ కు ప్రజల్లో ఎంత ఇమేజ్ ఉందో పవన్ కు కూడా ఇంచుమించు అంతేస్థాయి ఇమేజ్ ఉందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. కాగా ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, జగన్ లకు పవన్ ఫీవర్ పట్టుకుందనే చెప్పాలి. పవన్ ఏపీలో శక్తిమంతమైన నేతలా ఎదుగుతాడేమోనన్న భయంతో ఆ రెండు పార్టీల నేతలు తెగ కంగారు పడిపోతున్నారు. పవన్ ఏం చేస్తే దానికి ప్రతిగా ఆయా పార్టీలు చాలా చురుకుగా కదులుతున్నాయి. అధికార పక్షం అయితే పవన్ ఏ సమస్యను పట్టించుకున్నా ప్రభుత్వం దాన్ని చకచకా, అంతే ధీటుగా పరిష్కరించడమో లేక సమాధానాన్ని ప్రకటించడమో చేసేస్తుంది. అలా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్న నాయకుడుగా పవన్ ఎదుగుతున్నాడనడంలో ఏమాత్రం సందేహం లేదు.  పవన్ ప్రత్యేక హోదాపై  పెట్టిన రెండు సభలకే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందన్నది కూడా ప్రజలు అందుకు పవన్ కళ్యాణ్ పవరే కారణం అన్న రీతిగా చెప్పుకుంటున్నారు. అలాగే ఆక్వాఫుడ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పవన్ ఉద్యమిస్తున్నానని ప్రకటించిన వెంటనే అధికార ప్రతిపక్షాలు ఆగమేఘాలతో ప్రతిపక్షం ఏకంగా పోరాటమే మొదలెడితే, అధికార పక్షం మాత్రం త్వరత్వరగా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్వాపరాలపై క్లారిటీ ఇచ్చేందుకు, తగిన విధంగా నచ్చచెప్పే దిశగా అడుగులు వేసింది. ఇలా పవన్ కేంద్రంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారుతుందనే చెప్పాలి. అందుకనే చంద్రబాబు, జగన్ లు పవన్  అంటే ఉలిక్కిపడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ