Advertisementt

మూడక్షరాల సినిమాకు మూడేళ్ళు పట్టింది!

Tue 18th Oct 2016 11:28 PM
shankara,shankara movie,nara rohit,shankara movie release details,3 years  మూడక్షరాల సినిమాకు మూడేళ్ళు పట్టింది!
మూడక్షరాల సినిమాకు మూడేళ్ళు పట్టింది!
Advertisement
Ads by CJ

ఒక సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయడానికి సుదీర్ఘ సమయం తీసుకున్న ఘనత 'శంకర' చిత్రానికి దక్కుతుంది. నారా రోహిత్ నటించిన 'శంకర' సినిమాను ఈనెల 21 రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు. 'శంకర' షూటింగ్ మెుదలైంది ఎప్పుడో తెలుసా? 24 జనవరి, 2013లో అంటే ఆశ్చర్యం కలుగుతుంది. మూడక్షరాల సినిమా పూర్తికావడానికి మూడేళ్ళు పట్టింది. 'శంకర' చిత్రం తమిళ హిట్ సినిమా 'మౌనగురు' ఆధారంగా ప్రారంభించారు. 'మౌనగురు' హిందీలో 'అకీరా' పేరుతో మురుగదాస్ తీసి రిలీజ్ చేశారు. అయితే 'శంకర' చిత్రం మాత్రం వెలుగు చూడ్డానికి అపసోపాలు పడింది. మధ్యలో నారా రోహిత్ నటించిన పలు చిత్రాలు ప్రారంభమై విడుదలయ్యాయి కూడా. పైగా ఈ చిత్ర నిర్మాతల్లో కె.ఎస్. రామారావు కూడా ఉన్నారు. ఆయనకు పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఇక 'శంకర'లో నటించిన ఆహుతి ప్రసాద్, ఎం.ఎస్.నారాయణ వంటి ఆర్టిస్టులు ఇప్పటికే స్వర్గస్తులయ్యారు. ఇంతటి చరిత్ర ఉన్న ఈ సినిమా ఏ మేరకు బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందో చూడాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ