అన్న సినిమా కోసం తమ్ముడి సినిమాను థియేటర్లు ఎత్తేస్తున్నారు. ఈ సీన్ మరో 48 గంటల్లో జరగబోతోంది. (అన్న) కల్యాణ్ రామ్ సినిమా 'ఇజం' కోసం (తమ్ముడు) జూ.ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' కు టర్మినేషన్ చెప్పేస్తున్నారు. అంటే అన్న కోసం తమ్ముడు త్యాగం చేస్తున్నాడన్నమాట. 'జనతా గ్యారేజ్' యాభై రోజుల ప్రదర్శన సైతం పూర్తవుతుంది. ఇంకా లాంగ్ రన్ కు అవకాశం లేకపోవడంతో హైదరాబాద్ లోని సంధ్య 35 ఎం.ఎం. మెయిన్ థియేటర్ 'ఇజం' కోసం ముస్తాబవుతోంది. తెలంగాణ జిల్లాలన్నింటిలో జనతా గ్యారేజ్ ఎత్తేసి 'ఇజం' ప్రదర్శించనున్నారు. రాయలసీమ, ఆంధ్రలో కూడా ఇదే పరిస్థితి ఉంది. 'జనతా గ్యారేజ్' స్టార్ హీరో సినిమా కాబట్టి మంచి మంచి థియేటర్లు దొరికాయి. ఇవి ఇప్పుడు కల్యాణ్ రామ్ కోసం షిప్ట్ అవుతున్నాయి. సినీరంగంలో ఇలా జరగడం సాధరణమే.