బాలీవుడ్ ప్రముఖ నటుడు రణబీర్ కపూర్ తో కమలహాసన్ కుమార్తె శృతి హాసన్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు ఈ మధ్య గాసిప్స్ గుప్పుమంటున్నాయి. రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ తో విడిపోయి చాలాకాలం అయింది. ఆ తర్వాత రణబీర్ కపూర్ చాలామంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఇలా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దగ్గర నుండి కంగనా రౌనత్ వరకు పలువురితో ఎఫైర్లు నడిపాడంటూ టాక్ గట్టిగానే నడిచింది. తాజాగా రణబీర్ కపూర్, శృతి హాసన్ తో డేటింగ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది.
రణబీర్ కపూర్, శృతి హాసన్ కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటించారు. అప్పటినుంచి రణబీర్ కపూర్, శృతి హాసన్ లు కలగలసి తిరుగుతూ ఉన్నారన్న ఊహాగానాలు బాగా వ్యాపించాయి. ఈ విషయంపై ఎట్టకేలకు శృతి హాసన్ స్పందించింది. శృతిహాసన్ తాజాగా ‘మిడ్ డే’ పత్రిక జరిపిన ముఖాముఖి చర్చలో పాల్గొని మాట్లాడుతూ.. తనకు, రణబీర్ కు మధ్య ఎలాంటి విషయం నడవలేదని, అది పెద్ద గాసిబ్ గా కొట్టిపడేసింది శృతిహాసన్. రణబీర్ కపూర్ కు తనకు మధ్య ఎఫైర్ నడుస్తుందన్న విషయంలో ఎలాంటి వాస్తవం లేదని శృతి వివరించింది. ఇంకా ఈ భామ మాట్లాడుతూ ఇలాంటి రూమర్లు ఎలా క్రియేట్ అవుతాయో అర్థమే కాదంటూ వాపోయింది శృతి. 'రణబీర్ తో నేను డేటింగ్ చేస్తున్నాననడం చాలా హాస్యాస్పదంగా ఉంది, అసలు ఇప్పుడు చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను, ఇటువంటి రూమర్లపై స్పందించే సమయం కూడా నాకు లేదు' అంటూ తెలిపింది శృతి.