రాజమౌళి అద్భుత సృష్టి 'బాహుబలి 2' రిలీజ్‌కు ఇంకా చాలా టైమ్ ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకువచ్చే ఈ చిత్రం పూర్తి వివరాలను ఇటీవల రాజమౌళి అండ్ కో.. వెల్లడించడంతో వ్యాపారపరంగా క్రేజ్ వచ్చింది. బయ్యర్లలో ఆసక్తి పెరిగింది. తెలంగాణ ప్రాంతానికి యాభై కోట్లకు అమ్ముడయి బోణి చేసింది. అంతే ఇతర బయ్యర్లు మేల్కొని సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. ఈ సినిమా గురించి ప్రతి రోజు ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న 'గౌతమిపుత్ర శాతకర్ణి', 'ఖైదీ నంబర్ 150' చిత్రాలు ఈ విషయంలో వెనక్కి వెళ్ళాయి. 'బాహుబలి 2' ప్రచారం ఈ చిత్రాలకు నష్టం తెచ్చేలా ఉందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో ఉంది. '..శాతకర్ణి' సినిమా గురించి ఇటీవలే టీజర్ విడుదల చేశాక బయ్యర్లలో కదలిక వచ్చిందట. కానీ 'ఖైదీ.. ' గురించి మాత్రం ఎలాంటి ప్రస్తావన లేదు. ఒకప్పుడు నైజాం ప్రాంతంలో చిరంజీవికి తిరుగులేని మార్కెట్ ఉండేది. తొమ్మిదేళ్ళుగా ఆయన సినిమాలు చేయకపోవడంతో బయ్యర్లు రేట్ విషయంలో సందిగ్దతతో ఉన్నారు. నైజాంతో పాటుగా ఆంధ్ర, రాయలసీమలో ఏ మేరకు 'ఖైదీ..'కి కలక్షన్లు వస్తాయి?. అనే అనుమానం ఉంది. వైజాగ్ ప్రాంతానికి మాత్రం అత్యధిక ఆఫర్ ఇచ్చి 'ఖైదీ..'ని సొంతం చేసుకున్నారని తెలిసింది.
బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన రన్నింగ్ హీరో. 'సింహ', 'లెజెండ్' వంటి సూపర్ హిట్స్ కలక్షన్లలో గీటురాయిగా ఉన్నాయి. కాబట్టి 'శాతకర్ణి' బిజినెస్ రేంజ్ ఏ విధంగా ఉంటుందనే దానిపై అంచనాలున్నాయి.