ప్రముఖ దర్శకదిగ్గజుడు రాజమౌళి స్టైలే వేరు. ఆయన్ని అందరూ రాజమౌళి గొప్ప దర్శకుడే కానీ కుటుంబిష్టుడబ్బా అంటుంటారు. అంటే ఏం లేదండీ తను ఏం చేసినా అది అతను ఒక్కడే కాకుండా కుటుంబాన్నంతా ఇన్వాల్వ్ చేసి చేసేస్తుంటాడని అర్థం అంతే. ఒక్క బాహుబలితోనే జక్కన్న సౌత్ ఇండియాలోనే టాప్ దర్శకుడు రేంజ్ ను సంపాదించుకున్నడు. ఇప్పుడు రాజమౌళి దర్శకుడుగా ప్రపంచ స్థాయిలో మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆయన సినిమాకి బిజినెస్ సంచలనాలు రేపుతుంటాయి.
రాజమౌళి చేసే ప్రతి సినిమాకు తన ఫ్యామిలిని కూడా ఇన్వాల్వ్ చేసి తలా ఓ పని అప్పజెప్తుంటాడు. అలా చేయడం జక్కన్నకు ఆనవాయితీగా మారింది. కీరవాణి మ్యూజిక్, ఎస్ఎస్ కాంచి, శ్రీవల్లి, రమా రాజమౌళి ఇలా ప్రతి ఒక్కరు ఒక్కో పనిని నెత్తినేసుకొని చేసేసుకుంటుంటారు. కానీ రెమ్యూనరేషన్ లో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడు. ఏ ఒక్క తలకాయని వదిలిపెట్టడు. అలాంటిదన్నమాట దర్శకుడి జక్కన్న స్టైల్.
అయితే భారీ బడ్జెట్ తో రూపొందిన బాహుబలి సినిమాకు రాజమౌళి ఫ్యామిలి ప్యాకెజీని మాట్లాడుకున్నాడట. బాహుబలి రెండు భాగాలకు కలిపి రాజమౌళి 70 కోట్లను తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ప్యాకేజీలో కేవలం రాజమౌళికే 60 కోట్ల వరకు ముట్టుతుందన్నది టాక్. మిగిలిన దాన్ని తక్కిన ఫ్యామిలి టెక్నీషియన్స్ కు ఇస్తారని తెలుస్తుంది. మొత్తానికి రాజమౌళి రెమ్యూనరేషన్ ఇప్పుడు టాలీవుడ్ లో సంచనలనాంశంగా తయారైంది.