Advertisementt

మహేష్ మూవీ కి మరో టైటిల్..!

Mon 17th Oct 2016 08:22 PM
agent siva mahesh babu film,mahesh babu film title,agent siva,murugadoss,mahesh  మహేష్ మూవీ కి మరో టైటిల్..!
మహేష్ మూవీ కి మరో టైటిల్..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తమిళ క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ పై ఇంకా సందేహం కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా టైటిల్స్ పై పలు రకాల పేర్లు అనుకుంటున్నా ఇప్పటివరకు ఒక్కటి కూడా ఖాయం చేసినట్లు లేదు. అందుకనే తాజాగా మహేష్ సినిమా టైటిల్ ‘ఏజెంట్ శివ’గా పరిశ్రమలో వినిపిస్తుంది.

ఈ టైటిల్ కంటే ముందు ‘ఎనిమి’, ‘వాస్కోడిగామా’, ‘అభిమన్యుడు’ వంటి రకరకాల పేర్లు వినిపించినా వాటిలో ఏ ఒక్కటి ఖాయం చేయనట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా టైటిల్ పై తాజాగా మీడియాలో జోరు ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకు టైటిల్ గా ‘ఏజెంట్ శివ’ అనే పేరును ఖాయం చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ లో కూడా ప్రస్తుతం ఈ టైటిల్ పైనే ప్రచారం బాగా జరుగుతుంది. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ ‘ఏజెంట్ గోపి’ అనే పేరుతో సినిమా చేసి మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. ఆ దిశగా దర్శక నిర్మాతలు, హీరో మహేష్ తీవ్రంగా ఆలోచించి ఈ సినిమాకు ‘ఏజెంట్ శివ’ అనే టైటిల్ ను ఖాయం చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. కాగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ దీపావళి రోజు విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఆ లోపే టైటిల్ కూడా ఖాయం చేసేద్దామన్న ఆలోచనలో చిత్రబృందం ఉంది. మొత్తానికి ‘ఏజెంట్ శివ’ గా మహేష్ బాబు ఇక మెరవనన్నాడన్న మాట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ