Advertisementt

కపిల్ దేవ్ గా కండల వీరుడు!

Mon 17th Oct 2016 07:32 PM
kapil dev,salman khan,bollywood,kabir khan,salman in kapil dev role  కపిల్ దేవ్ గా కండల వీరుడు!
కపిల్ దేవ్ గా కండల వీరుడు!
Advertisement
Ads by CJ

కండలవీరుడు ఇక చేతితో క్రికెట్ బాల్, బ్యాట్ పట్టనున్నారు. వెండితెరపై హీరోయిన్లతో రొమాన్స్ , విలన్లతో ఫైట్స్ చేసిన సల్మాన్ ఖాన్ క్రికెటర్ గా కనిపిస్తారు. అయితే ఇది కేవలం ఒక క్రికెటర్ కథతో తీస్తున్న చిత్రం మాత్రం కాదు. బయోపిక్ కథలతో బాలీవుడ్ లో తీస్తున్న సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. తాజాగా 1983 ప్రపంచకప్ నేపథ్యంలో సినిమా రాబోతోంది. అనాడు ఇండియా విజేత అయిన  విషయం తెలిసిందే. కబీర్ ఖాన్ ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ప్రపంచకప్ విజేత అనగానే ఆనాడు టీమిండియాకు కెప్టెన్ గా ఉన్నది కపిల్ దేవ్ గుర్తుకువస్తాడు. ఇదే సినిమాలో కీలకపాత్ర. దీన్ని ఎవరు పోషిస్తారనే దానిపై ఇంకా సస్సెన్స్ ఉన్నప్పటికీ, సల్మాన్ ఖాన్ కే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కబీర్ ఖాన్ ప్రస్తుతం ట్యూబ్ లైట్ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో సల్మాన్ నటిస్తున్నారు.  వీరిద్దరి మధ్య కొత్త సినిమా చర్చలు జరిగాయని, కపిల్ దేవ్ పాత్రకి సల్మాన్ ను ఎంపికచేశారని ప్రచారం జరుగుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ