ఎంతో పోటీ ఉండే సినీ పరిశ్రమలో దర్శకుల పాత్ర చాలా పెద్దది. ఇక్కడ ఎవరు, ఎప్పుడు, ఎవరితో హిట్ ఇస్తారు అనేదే ముఖ్యం. కాగా ఇలాంటి డైరెక్టర్స్ మధ్య పోటీలో వరుసగా మూడు చిత్రాలు హిట్ ఇచ్చి హ్యాట్రిక్ ఇవ్వడమంటే మాటలు కాదు. గత దశాబ్ద కాలంలో రాజమౌళి, బోయపాటి, కొరటాల శివ వంటి కొందరు మాత్రమే తమ తొలి మూడు చిత్రాలతో హ్యాట్రిక్‌లు నమోదు చేశారు. కాగా ఈ ఫీట్ సాధించడం కోసం మరికొందరు యువ దర్శకులు ఇప్పుడు లైన్లో ఉన్నారు. 'ఊహలు గుస గుసలాడే, .జ్యో అచ్యుతానంద' చిత్రాలతో వరసగా రెండు హిట్ చిత్రాలను తీసిన అవసరాల శ్రీనివాస్ వచ్చే ఏడాది నానితో చిత్రం చేయనున్నాడు. ఆయన హాట్రిక్ కోసం కృషి చేస్తున్నాడు. ఇక 'కార్తికేయ, ప్రేమమ్' చిత్రాలతో రెండు పెద్ద హిట్లు కొట్టిన చందుమొండేటి కూడా హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఉన్నాడు. 'ఉయ్యాల జంపాల'తో హిట్ కొట్టిన విరించి వర్మ తాజాగా నాని హీరోగా తెరకెక్కిన 'మజ్ను' చిత్రం ఫ్లాప్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా ఓకే అనిపించింది. దీంతో ఈయన కూడా హ్యాట్రిక్ రూటు చూస్తున్నాడు. ఇక మేర్లపాక గాంధీ, అనిల్ రావిపూడి లాంటి చాలామంది ఈ ఫీట్ కోసం ఎదురుచూస్తున్నారు.