ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వ పాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టే వైయస్ఆర్ పార్టీ నేత, ప్రతిపక్ష నాయకుడు జగన్ ను కాదని మెగా అక్వాఫుడ్ పార్క్ ను వ్యతిరేకిస్తున్న రైతులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలవడంలో ఏదైన మతలబు ఉందా?. జగన్ పై నమ్మకం లేకే వాళ్ళు పవన్ శరణుకోరారా? ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్ కంటే పవన్ కే బలముందా? ఇలా అనేక ప్రశ్నలు వస్తున్నాయి. బాబు నిర్ణయాన్ని మార్చగలిగే శక్తి పవర్ స్టార్ కు ఉందని రైతులు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో అమరావతి నిర్మాణానికి బలవంతంగా భూములు సేకరిస్తున్న సందర్భంలో పవన్ ఎంట్రీ ఇచ్చాడు. అది కొంతవరకు సత్పలితాలనిచ్చింది. ఆ నమ్మకంతోనే అక్వాఫుట్ పార్క్ లో భూములు కోల్పోతున్న రైతులు పవన్ దగ్గరకు వచ్చేలా చేసిందనే మాట వినిపిస్తోంది. దీనిపై పవన్ రియాక్షన్ కొంత అతిగా కనిపించినప్పటికీ, సమస్యను ప్రభుత్వదృష్టికి తీసుకురావడానికి దోహదపడింది. జనసేన పార్టీ ఏక నాయకుడితో నడుస్తోంది. అదే జగన్ కైతే ఎమ్మెల్యేల, ఎంపీల బలం ఉంది. అయినప్పటికీ ఆయన చేయలేనిది పవన్ చేస్తాడని రైతులు నమ్మడం విశేషం.