హీరోగా తాను, తన ఇద్దరు కుమారులు అంటే మొత్తంగా అక్కినేని తరం నుండి వచ్చిన నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌లు హీరోలుగా దూసుకెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఈ వయసులో కూడా విభిన్న చిత్రాల ద్వారా నాగ్ తన సత్తా బాగా చాటుతున్నాడు. ఇక నాగచైతన్య కూడా 'ప్రేమమ్'తో మరో హిట్‌ను కొట్టాడు. అఖిల్ త్వరలో విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తన రెండో చిత్రం చేయనున్నాడు. ఇక నాగార్జున విషయానికి వస్తే కొత్తతరం దర్శకులను ఎంకరేజ్ చేయడంలో, వైవిధ్య చిత్రాలకు మారుపేరుగా చెప్పుకోవచ్చు. నిన్నటితరం నలుగురు స్టార్ హీరోల్లో నాగ్ చేసినని ప్రయోగాలు, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించిన తీరు అందరికీ ఆదర్శంగా చెప్పుకోవాలి. ఎందరో కొత్త దర్శకులకు ఆయన అవకాశం ఇచ్చారు. కాగా ఇప్పుడు ఆయన ఇద్దరు కుమారులు చైతూ, అఖిల్‌కు కూడా హీరోలు కావడంతో నాగ్‌లో ఉత్సాహం పొంగిపొర్లుతోంది. కొత్త కొత్త దర్శకులను పిలిచి ఆయన ముందు కథ సిద్దం చేయండి... మా ముగ్గురిలో ఎవరికి ఏ చిత్రం సూట్ అయితే వారితో తీస్తాను అని టాలెంట్ మొత్తాన్ని అన్నపూర్ణ బేనర్స్‌లో లాక్ చేస్తున్నాడు. విక్రమ్ కె.కుమార్ 'మనం' తర్వాత మరలా అఖిల్‌తో చిత్రం చేయనుండటం, 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంతో తాను పరిచయం చేసిన కళ్యాణ్‌కృష్ణకు మరలా నాగచైతన్య చిత్రానికి అవకాశం ఇవ్వడం జరుగుతోంది. ఇక 'ఉయ్యాల జంపాల' ఫేమ్ విరించి వర్మ, 'పెళ్ళిచూపులు' డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌కు, ఇక 'ప్రేమమ్' తీసిన చందు మొండేటికి తన బేనర్‌లో అవకాశాలు ఇస్తున్నాడు. వంశీపైడిపల్లిని కూడా లైన్‌లో పెెట్టాడు. మొత్తానికి నాగ్ ఇప్పుడు అందివచ్చిన తన కుమారులతో రాకెట్ స్పీడ్‌తో ముందుకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు.