Advertisementt

పవన్‌ పేరు చెప్పి శృతి తప్పు చేసిందా..!

Sun 16th Oct 2016 11:00 PM
pawan kalyan,shruti haasan,gabbar singh,katama rayudu,shruti haasan about pawan kalyan  పవన్‌ పేరు చెప్పి శృతి తప్పు చేసిందా..!
పవన్‌ పేరు చెప్పి శృతి తప్పు చేసిందా..!
Advertisement
Ads by CJ

కమలహాసన్‌ కుమార్తె శృతిహాసన్‌ మల్టీటాలెంటెడ్‌ పర్సన్‌. ఆమె నటిగానే కాదు.. సంగీతంలో, పాటలు పాడడంలో, పాటలను, కవిత్వాలను రాయడం, డ్యాన్స్‌ కొరియోగ్రఫీ చేయడం వంటి పలు టాలెంట్స్‌ ఆమెలో ఉన్నాయి. కాగా ఈమె తాజాగా తన సొంత స్క్రిప్ట్‌తో, నెరేషన్‌తో ఓ ప్రైవైట్‌ ఆల్బం తయారుచేసింది. ఇందులో శృతి అన్ని తానై నిర్వహించి ప్రస్తుతం విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. మరోపక్క ఆమె నటించిన 'ప్రేమమ్‌' చిత్రంలో అదరగొట్టే అభినయం ఇచ్చింది. తాజాగా ఆమె మాట్లాడుతూ, తెలుగు, తమిళ, మలయాళ, బాలీవుడ్‌ చిత్రాలలో తాను నటించినప్పటికీ అవ్వన్నీ ఫ్లాప్‌ కావడంతో తనకు ఐరన్‌లెగ్‌ అనే ముద్ర పడిందని, కాగా పవన్‌కళ్యాణ్‌గారి 'గబ్బర్‌సింగ్‌' చిత్రమే తనకు కీలక టర్న్‌గా మారిందని చెప్పుకొచ్చింది. అలాంటి పవన్‌ గారితో తాను ప్రస్తుతం మరలా 'కాటమరాయుడు' చిత్రంలో నటిస్తుండటం ఎంతో థ్రిల్‌గా అనిపిస్తోందని అంటోంది. మొత్తానికి ఆమె తన కెరీర్‌కు కీలకమైన 'గబ్బర్‌సింగ్‌' చేసిన పవన్‌కే ఆ క్రెడిట్‌ మొత్తం దక్కుతుందని చెప్పిన తర్వాత ఇతర హీరోల చిత్రాలలో ఆమెను పెట్టుకుంటారా? అసలే ఇగోలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన టాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు ఉంటాయా? ఈ వ్యాఖ్యలు ఆమె కెరీర్‌ను ఇబ్బందుల పాలుచేస్తాయా? అనే చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ