సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల మనవడు, నరేష్ తనయుడు నవీన్ హీరోగా పరిచయం అవుతున్న 'నందిని నర్సింగ్ హోమ్' చిత్రం ఈనెల 21న విడుదల కానుంది. ఈ సినిమా కంటే చాలా ముందుగా ప్రారంభమైన 'ఐనా ఇష్టం నువ్వు' అనే సినిమా మాత్రం మధ్యలోనే ఆగిపోయింది. చిత్ర పరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్ గా అపార అనుభవం ఉండి, అరడజను సినిమాలు తీసిన అడ్డాల చంటి ఫ్రెండ్లీ మూవీస్ పై 'ఐనా ఇష్టం నువ్వు' అనే సినిమా తీశారు. వారసత్వపు హీరో కదా ఎలాంటి ఇబ్బంది ఉండదనుకున్నాడు. కానీ రెండు షెడ్యూల్స్ పూర్తిచేశాక ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. దీన్ని అధిగమించడానికి సీనియర్ నరేష్ ను సంప్రదిస్తే ఆయన నుండి చిరునవ్వే సమాధానంగా వచ్చిందట. కొడుకు సినిమా పూర్తిచేయడానికి ఎలాంటి సహకారం అందించకపోగా, మా అబ్బాయికి రెమ్యూనరేషన్ 'ఇంత' అంటూ డిమాండ్ చేశాడట. దాంతో సినిమా ఆగిపోయింది. ఈలోపు మరో ప్రొడ్యూసర్ ను వెతుక్కుని 'నందిని..' చిత్రం ద్వారా నవీన్ ను పరిచయం చేస్తున్నారు. ఫ్రెండ్లీ మూవీస్ కు మాత్రం ట్రాజడి మిగిలింది.