చిత్రవిచిత్రమైన కథలను, ఆంగ్ల చిత్రాల ప్రేరణతో రచించే వక్కంతం వంశీ చెప్పిన కథకి కల్యాణ్ రామ్ బ్రేక్ వేశాడు. గతంలో ఎప్పుడో ఎన్టీఆర్ కు కథ చెప్పి ఒప్పించుకుని, యన్టీఆర్ ఆర్ట్స్ లో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. కానీ తాజా సమాచారం మేరకు వంశీ కథని కల్యాణ్ రామ్ నిర్విద్దంగా తోసిపుచ్చారు. ఈ విషయాన్ని రామ్ స్వయంగా చెప్పేశారు. కథ నచ్చలేదని చెప్పడానికి తానేమి మోహమాటపడలేదని అన్నారు. పూరి దర్శకత్వంలో తీయబోయే సినిమాకు వంశీ కథ అందిస్తారని ప్రచారం జరిగినా, ఇప్పుడది నిజం కాదని స్పష్టమైంది. మరోవైపు రచయిత నుండి దర్శకుడిగా మారడానికి వంశీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అతడి కథని రిజెక్ట్ చేశారని స్పష్టం కావడం వంశీకి పెద్ద మైనస్ అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే వక్కంతం వంశీ అందించిన కథలతో గతంలో ఎన్టీఆర్ నటించిన అశోక్, ఊసరవెల్లి చిత్రలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ అనుభవం నేపథ్యంలో కల్యాణ్ రామ్ సరైన నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.