Advertisementt

ఎన్టీఆర్, రామ్ బాటలో సాయిధరమ్ !!

Sun 16th Oct 2016 04:32 PM
sai dhram tej,new movie,winner movie,jr ntr,ram,naannaku premato,hyper movie,fallowing  ఎన్టీఆర్, రామ్ బాటలో సాయిధరమ్ !!
ఎన్టీఆర్, రామ్ బాటలో సాయిధరమ్ !!
Advertisement
Ads by CJ

మెగా కుటుంబ హీరో సాయిధరమ్ తేజ్ మాస్ ఇమేజ్ కోసం కాకుండా సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న 'తిక్క' సినిమా బాక్సాఫీస్ వద్ద దిమ్మతిరిగే షాక్ ఇవ్వడంతో, వాస్తవం తెలిసివచ్చింది. అందుకే తన సీనియర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ తరహాలో ఈసారి సెంటిమెంట్ కథని నమ్ముకున్నారు. సాయిధరమ్ తాజా చిత్రం పేరు 'విన్నర్'. ఈ చిత్రకథ తండ్రికి సంబంధించిందే. తండ్రికి, ప్రియురాలికి నడుమ జరిగే కథని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. తండ్రి సెంటిమెంట్ తో ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో' మంచి విజయం సాధించింది. హీరో రామ్ నటించగా ఇటీవలే విడుదలైన 'హైపర్' లో కూడా తండ్రి సెంటిమెంట్ ఉంది. ఇది కూడా కమర్షియల్ గా వర్కవుట్ అయింది. 'విన్నర్' కూడా ఇదే తరహా సినిమా కావడం విశేషం. దర్శకుడు గోపిచంద్ మలినేని ఈసారి వినోదాన్ని వదిలేసి సెంటిమెంట్ కథతో ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏ మేరకు వర్కవుట్ అవుతుందనేది చూడాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ