Advertisementt

ఖైదీకి ముందు... వెనుక..!

Sun 16th Oct 2016 04:11 PM
khaidi no 150,ramcharan,chiranjeevi,dhruva,winner,sai dharam tej  ఖైదీకి ముందు... వెనుక..!
ఖైదీకి ముందు... వెనుక..!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ ప్రేరణతో ఆయన కుటుంబ సభ్యులు పలువురు హీరోలుగా పరిచయమై రాణిస్తున్నారు. కొంత విరామం తర్వాత చిరంజీవి నటిస్తుండడంతో ఆ సినిమాలో కనిపించడానికి మెగా కుటుంబ హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇకపోతే జనవరిలో సంక్రాంతి బరిలో చిరంజీవి దిగబోతున్నారు. ఆయన నటిస్తున్న 'ఖైదీ నంబర్‌ 150' చిత్రం విడుదలవుతుంది. మళ్లీ మెగాపవర్‌ చూపించేందుకు కుటుంబ హీరోలు తమవంతు సహకారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవి చాలా ముందుగానే సంక్రాంతిని బ్లాక్‌ చేసేశారు. ఈ కారణంగా మెగావారసుడు రామ్‌ చరణ్‌ నటిస్తున్న 'ధృవ' చిత్రం డిసెంబర్‌ మొదటివారంలో విడుదలకు ప్లాన్‌ చేయగా, పైగా ఆయన చిరు సినిమాకు నిర్మాత కూడా. ఇక సాయిధరమ్‌ నటిస్తున్న 'విన్నర్‌' రాక ఫిబ్రవరి 24, 2017కు మారింది. మహాశివరాత్రి ముందురోజున సాయిధరమ్‌ 'విన్నర్‌'గా వస్తాడన్నమాట. అంటే చిరంజీవి సినిమాకు ముందు, వెనుక కూడా మెగా కుటుంబ హీరోల సినిమాలే ఉంటాయి. ఇది అభిమానులకు ఆనందమే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ