ప్రస్తుతం బన్నీ కెరీర్ పూర్తి జోరుగా ఉంది. ఆయన ప్రస్తుతం 'డిజె' చిత్రంలో నటిస్తున్నాడు. దీని తర్వాత ఆయన లింగుస్వామి దర్శకత్వంలో ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నాడు. కాగా ఆయన త్వరలో విడుదల కానున్న ఓ కన్నడ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. అదే 'బద్మాష్' మూవీ. ఈ కన్నడ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇందులో ధనుంజయ హీరోగా నటించాడు. ఓ మంచి రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఉండే ఈ చిత్రంపై బన్నీ చూపుపడింది. కన్నడలో విడుదలైన వెంటనే 'బద్మాష్' రిజల్ట్ చూసి ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడంపై తన తండ్రి అల్లుఅరవింద్‌తో బన్నీ ఈ చిత్రం గురించి మాట్లాడాడని అంటున్నారు. మరి బన్నీ 'బద్మాష్'గా వస్తాడా? రాడా? అనేది వేచిచూడాల్సివుంది.