ఇప్పుడు ఏపీ అంతా ఒకటే టాపిక్. అది 10,000 కోట్లు నల్లధనాన్ని తెల్లదనం గా మార్చుకున్నది ఎవరా అని అందరూ తెగ బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు. ఆ డబ్బు ఎవరిదై ఉంటుందబ్బా అని రాజకీయనేతలందరూ తెగ చర్చించుకుంటున్నారు. అయితే ఆ డబ్బు నీదంటే నీదని చంద్రబాబు, జగన్ తెగ వాదించేసుకుంటున్నారు. అలాగే వీరిద్దరూ ప్రధానికి లేఖలు కూడా రాశారు. అసలు మోడీ ప్రభుత్వం నల్లధనం వున్నవారు ఆ డబ్బుని గనక ప్రభుత్వానికి చెల్లించేస్తే వారి పేర్లు బయట పెట్టమని హామీ కూడా ఇచ్చింది. మరి అలాంటప్పుడు ఈ 10,000 కోట్ల నల్లధనం గురించి కేంద్రం ఎలా బయటపెట్టిందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఇక ఈ చెల్లింపు కార్యక్రమం మాత్రం ఒక్క కేంద్రమంత్రులకు మాత్రమే తెలిసే ఛాన్స్ వుంది. మరి ఏపీకి చెందిన కేంద్రమంత్రులు ఎవరన్నా ఈ విషయాన్ని లీక్ చేశారా... లేక అదే బయటికొచ్చిందా అనేదానికి ఒక న్యూస్ రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేస్తుంది.
ఆ నల్లధనం విషయం కేంద్రమంత్రుల దగ్గర నుండే బయటికి వచ్చిందని ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. అదెవరంటే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడే ఈ నల్లధనం కలిగిన వ్యక్తి వివరాలు ఏపీ ముఖ్యమంత్రికి తెలిపాడని అంటున్నారు. లేకపోతే చంద్రబాబుకి తెలిసే ఛాన్స్ లేదని అంటున్నారు. అయితే ఈ విషయం ఎలాగో జగన్ కనిపెట్టి వెంకయ్య నాయుడిని టార్గెట్ చేస్తూ మీడియాలో హడావిడి చేస్తున్నాడని అంటున్నారు. ఇంకా ఈ విషయాన్ని ఎవరు బయటపెట్టారో ముందు చెప్పాలని జగన్, ప్రధాని మోడీని తెగ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే వెంకయ్యని టార్గెట్ చేస్తూ జగన్ రెచ్చిపోయి మోడీ దగ్గర ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడని టాక్. మరి మోడీ.. వెంకయ్యని పిలిచి ఏమన్నా వార్నింగ్ లాంటివి ఇస్తాడా లేక తన విధేయుడు గనక ఏం అనకుండా వదిలేస్తాడా చూద్దాం ఏం జరుగుతుందో?