నేటి సినిమాలు ఉద్రేకాన్నిపెంచుతున్నాయి: వాణిశ్రీ
అలనాటి నటి అభినేత్రి వాణిశ్రీ నేటి సినిమాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ, ఉద్రేకాన్ని పెంచుతున్నాయని చురక అంటించారు. మహిళలను కించపరిచే విధంగా సినిమాలు తీస్తున్నారని, ఇది తనకు ఎంతో బాధ కలిగిస్తోందని అన్నారు. తెలుగు భాషను బతికించుకోవాలని, సమాజహితంగా సినిమాలు తీయాలని దర్శక, నిర్మాతలకు సూచించారు. రచయితలు మంచి మంచి కథలు రాయాలని ఆమె పేర్కొన్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వాణిశ్రీ పై విధంగా స్పందించారు. మరి వాణిశ్రీ సూచనను మన దర్శకులు పాటిస్తారా?.