Advertisementt

బాలయ్య ఈ యాగం ఎందుకు చేసినట్లో?

Sun 16th Oct 2016 09:55 AM
balakrishna,yagam,chandrababu naidu,lokesh,balakrishna kalasarpadosha yagam  బాలయ్య ఈ యాగం ఎందుకు చేసినట్లో?
బాలయ్య ఈ యాగం ఎందుకు చేసినట్లో?
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణకు జాతకాలు, వాస్తు వంటి వాటిపై మంచి గురి ఉంది. పుట్టిన తేదీని బట్టి జ్యోతిష్యం చూడటం కూడా బాలయ్యకు తెలుసు. కాగా ఇటీవల ఆయన సతీ సమేతంగా పరాంకుశం వేణుస్వామి సారధ్యంలో 'కాలసర్ప దోష నివారణ' యాగం చేశాడని తెలుస్తోంది. ఈ యాగాన్ని మామూలు పండితులు చాలరు. దీనికి మహా పండితులు కావాలి. ఇంతకీ ఇప్పుడు విషయం ఏమిటంటే అందరు ఆయన చేసిన యాగం గురించి చర్చించుకుంటున్నారు. ఏదైనా సరే అధికారం, పదవులు వంటి వాటి కోసమే ఇలాంటి యాగం చేస్తారు. వాస్తవానికి చంద్రబాబు తర్వాత బాలయ్య సీఎం అయ్యే అవకాశం లేదు. లోకేష్‌కు ఇస్తే ఆయనకు ఇంకా సంతోషం. కాబట్టి రాబోయే రోజుల్లో టిడిపి పూర్తిగా నారా వారి పార్టీ అయిపోతుంది. దీంతో నందమూరి వంశంకు పెద్దగా ఏమీ లభించదని అంటున్నారు. అయితే బాలయ్యకు ముఖ్యమంత్రిగా చేయాలని లేకపోయినా ఆయన మంత్రిగా మాత్రం మారాలనుకుంటున్నారు. తనకు పర్యాటక శాఖ ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానని బాలయ్య ఆల్‌రెడీ చంద్రబాబుకు హింట్‌ ఇచ్చి ఉన్నాడు. మరి ఈ నేపధ్యంలో బాలయ్య 'కాలసర్పదోష నివారణ' యాగం ఎందుకోసం? ఎవరి కోసం? చేశాడనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ