Advertisementt

ఈ గ్యాప్ ని ఎన్టీఆర్ వాడుకోవచ్చుగా..!

Sat 15th Oct 2016 08:10 PM
jr ntr,trivikram srinivas,puri jagannadh,janatha garage  ఈ గ్యాప్ ని ఎన్టీఆర్ వాడుకోవచ్చుగా..!
ఈ గ్యాప్ ని ఎన్టీఆర్ వాడుకోవచ్చుగా..!
Advertisement
Ads by CJ

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎప్పటినుండో  ఓ చిత్రాన్ని త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో చేయాలని వుంది. పలుసార్లు ఈ కాంబినేషన్‌ ఎప్పటినుంచో అందరి నోళ్లలో నానుతోంది. ఇక మరోవైపు ఎన్టీఆర్‌ 'టెంపర్‌, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌'ల తర్వాత వెంటనే ఓ యాక్షన్‌ చిత్రం చేయకూడదని భావిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్‌ తన తదుపరి చిత్రాన్ని పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోపక్క అనిల్‌ రావిపూడి, వక్కంతం వంశీలు ఖాళీ గానే ఉన్నారు. కానీ ఎన్టీఆర్‌ మాత్రం 'జనతా గ్యారేజ్‌' తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చేయాలని భావిస్తున్నాడు. త్రివిక్రమ్‌ స్టైల్లో తన తదుపరి చిత్రం ఉండాలనేది ఆయన కోరిక. మరోవైపు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కూడా 'అ..ఆ' తర్వాత కొంత గ్యాప్‌ తీసుకొని పవన్‌తో ఓ చిత్రానికి కమిటై ఆ స్క్రిప్ట్‌లో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో పవన్‌కళ్యాణ్‌ చిత్రం మొదలవ్వడానికి ఇంకా చాలా టైమ్‌ ఉంది. ఇప్పటికే పవన్‌ 'కాటమరాయుడు'తో పాటు నీసన్‌ చిత్రం మొదలు పెట్టాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయి విడుదలయ్యేంత వరకు త్రివిక్రమ్‌కు కూడా చాలా గ్యాప్‌ దొరికింది. దాంతో ఈ కాంబినేషన్‌ నిజంగా వర్కౌట్‌ కావడానికి ఇదే సరైన సమయం. మరి ఈ కాంబో రంగంలోకి దిగితే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఎన్నో అగ్ర నిర్మాణ సంస్దలు వెయిట్‌ చేస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ