ఏకంగా ఆ ఒక్క దర్శకునికే నాలుగు సంవత్సరాలు కాల్షీట్స్ ఇవ్వడం అంటే మాటలు కాదు. 'మిర్చి' తర్వాత అంత స్పీడులోకి వచ్చిన ప్రభాస్ 'బాహుబలి' కాలంలో నాలుగైదు సినిమాలు చేసేవాడు. ప్రభాస్ 'బాహుబలి'కి తన సమయంతో పాటు ఎప్పుడో చేసుకోవాలని భావించిన పెళ్లిని సైతం పక్కన పెట్టాడు. కాగా ఈ చిత్రం సెకండ్ పార్ట్ ప్రస్తుతం షూటింగ్ చివరిలో ఉంది. రెండు పాటలు, కొన్ని ప్యాచ్ వర్క్‌లు మినహా అంతా పూర్తయిపోయింది. ఇంతకు ముందు ప్రభాస్‌తో రాజమౌళి 'ఛత్రపతి'తో పాటు తన సొంత బేనర్ కోసం ప్రభాస్‌తోనే విశ్వామిత్రునిగా మార్చాడు. అలా చూసుకుంటే అప్పట్లో ప్రభాస్, రాజమౌళిల మధ్య ఉన్న స్నేహగాఢత ఇప్పుడు మరింతగా పెరిగింది. కాగా 'బాహుబలి' పార్ట్1తో రాజమౌళి సైతం ప్రభాస్‌కు జాతీయ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టాడు. మరి 'బాహుబలి - ది కన్‌క్లూజన్' చిత్రంతో మరో పెద్ద హిట్ ఇస్తామని అందరూ నమ్ముతున్నారు. ఇక రాజమౌళి ఇప్పటివరకు తన హీరోల్లో ఎవ్వరికీ ఓ సినిమా చేసి హిట్ కొడితే ట్రీట్ ఇచ్చిన సందర్బాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం రాజమౌళి తన కెరీర్‌లో మొదటిసారిగా ప్రభాస్ అండ్ టీంకు మంచి ట్రీట్ ఇవ్వనున్నాడని సమాచారం. ఈ ట్రీట్‌కు ప్రభాస్ జన్మదినమైన అక్టోబర్ 23నే వేదిక చేసుకుంటున్నాడు రాజమౌళి. ఆ రోజున 'బాహుబలి' టీంకు జక్కన్న ఫేర్‌వెల్ పార్టీ ఇస్తున్నాడు.