బాలయ్య తన 100వ చిత్రం కోసం ఎందరో దర్శకులను కాదని ఎట్టకేలకు క్రిష్‌కు అవకాశం ఇచ్చాడు. ఇక తన కెరీర్‌లో 'గమ్యం' నుండి 'కంచె' వరకు తీసుకుంటే క్రిష్ చేసిన చిత్రాలను చూసిన వారు ఆయనను మంచి డైరెక్టర్ అని ఒప్పుకుంటారు. కానీ ఇవేమీ ఆయనకు బ్లాక్‌బస్టర్‌ను అందించిన చిత్రాలు మాత్రం కావు. దాంతో క్రిష్‌కు మంచి దర్శకునిగా పేరొచ్చిందే కానీ కమర్షియల్ డైరెక్టర్‌గా పేరు రాలేదు. కానీ తన కెరీర్‌లో మొట్టమొదటి సారిగా బాలకృష్ణ వంటి తిరుగులేని మాస్ ఇమేజ్‌ను కలిగివున్న హీరో ఎంతో నమ్మి బాధ్యతలు అప్పగించాడు. దీంతో క్రిష్‌కు ఇప్పుడు 'గౌతమిపుత్ర శాతకర్ణి' కీలకంగా మారింది. ఈ చిత్రం ద్వారా క్రిష్ కమర్షియల్ హిట్‌ను అందుకోవాలనే ఆశతో ఉన్నాడు. ఇలా వీరిద్దరి కలయికలో రానున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇక బాలకృష్ణ కన్నా ఓవర్‌సీస్‌లో క్రిష్‌కే ఎక్కువ క్రేజ్ ఉందనేది వాస్తవం. ఇప్పటివరకు బాలయ్యకు ఓవర్‌సీస్‌లో ఒక్క మిలియన్ చిత్రం కూడా లేదు. కానీ సృజనాత్మకంగా చిత్రాలు తీసే క్రిష్‌కు మాత్రం అక్కడ మంచి గుర్తింపు ఉంది. వీటన్నిటినీ గమనిస్తే బాలయ్య వందో చిత్రమైన 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఈ ఇద్దరికీ ఎంతో కీలకంగా మారింది. చారిత్రాత్మక చిత్రంగా దీనికి ఓవర్‌సీస్‌లో క్రిష్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య వల్ల క్రేజ్ మరింత పెరిగింది. మరి ఈ చిత్రం క్రిష్‌తో పాటు బాలయ్య ఇమేజ్‌కు సైతం ప్రతిష్టాత్మకంగా మారిందనే చెప్పాలి.