Advertisementt

కోలీవుడ్ లోనూ 'కొబ్బరిమట్ట' సంచలనం..!

Sat 15th Oct 2016 04:38 PM
kobbari matta,sampoornesh babu,aadi kumbhagiri,kabbari matta sensation in tamil,kobbari matta kollywood news,sampoo,santanam comedian  కోలీవుడ్ లోనూ 'కొబ్బరిమట్ట' సంచలనం..!
కోలీవుడ్ లోనూ 'కొబ్బరిమట్ట' సంచలనం..!
Advertisement
Ads by CJ

సంపూర్ణేష్‌ బాబు. టాలీవుడ్‌లో ఈ పేరు తెలియని వారుండరేమో..! అంతలా సంచలనం అయ్యాడు సంపూ. 'హృదయ కాలేయం' సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ హీరోగా మారిపోయిన సంపూర్ణేష్‌..తాజాగా చేస్తున్న 'కొబ్బరిమట్ట' చిత్రంతో తన స్టామినా ఏంటో మరోసారి చూపేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఈ 'కొబ్బరిమట్ట'కి సంబంధించి బిజినెస్‌ వీరలెవల్లో జరుగుతున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది. టాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ ద్వారా అల్లు అరవింద్‌ డిస్ట్రిబ్యూట్‌ చేయనున్నాడనే వార్తలు ఆమధ్య వినిపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు కోలీవుడ్‌లో కూడా సంపూ సంచలనం కాబోతున్నాడు ఈ 'కొబ్బరిమట్ట'తో. అవును..ఈ సినిమాకి సంబంధించి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'కొబ్బరిమట్ట' తమిళ్‌ రైట్స్‌ ఫ్యాన్సీ రేటుకి అమ్ముడు పోయినట్లుగా తెలుస్తుంది. అదీ కూడా తమిళ్‌లోని ఓ టాప్‌ కమెడియన్‌ ఈ రైట్స్‌ని ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకున్నట్లుగా చిత్ర వర్గాల ద్వారా తెలుస్తుంది. సో..దీన్ని బట్టి తెలుస్తుంది ఏమిటంటే..టాలీవుడ్‌కే కాకుండా కోలీవుడ్‌కి కూడా సంపూ తన సత్తా చూపించనున్నాడన్నమాట. పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడుగా మూడు పాత్రల్లో సంపూ కనిపించనున్న ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్‌ మరియు సంజన మూవీస్‌ బ్యానర్‌లలో ఆది కుంభగిరి, సాయి రాజేష్‌ నీలం నిర్మిస్తున్నారు. రూపక్‌ రొనాల్డ్‌ సన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు స్టీవెన్‌ శంకర్‌ అందిస్తుండగా.. మిడ్‌వెస్ట్‌ మూవీస్‌ ద్వారా ఈ చిత్రం ఓవర్సీస్‌లో విడుదల అవుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ