Advertisementt

శ్రీజ మొదటి భర్త పెళ్లి చేసుకుంటున్నాడోచ్!

Sat 15th Oct 2016 04:25 PM
srija,sirish bharadwaj,sirish bharadwaj again marriage,chiranjeevi daughter  శ్రీజ మొదటి భర్త పెళ్లి చేసుకుంటున్నాడోచ్!
శ్రీజ మొదటి భర్త పెళ్లి చేసుకుంటున్నాడోచ్!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు చిరంజీవి చిన్నకూతురు శ్రీజ, శిరీష్ భరద్వాజ్ ని ప్రేమ పెళ్లి చేసుకుని పెద్దలని సైతం ఎదురించి వేరే కాపురం పెట్టింది. వారిద్దరి ప్రేమకి చిహ్నం గా ఒక కూతురు కూడా పుట్టింది. దాదాపు వారిద్దరూ రెండు సంవత్సరాలు పాటు కలిసిమెలిసి బాగానే వున్నారు. ఏమైందో ఏమో వారిద్దరికీ విభేదాలొచ్చి విడాకులు తీసేసుకున్నారు. అయితే చాలా కాలం అటు భరద్వాజ్, ఇటు శ్రీజ సింగిల్ గానే కాలం గడిపేశారు. అయితే చిరంజీవి మాత్రం తనకూతురిని అలా సింగిల్ గా వదిలెయ్యడం ఇష్టం లేక శ్రీజకి రీసెంట్ గా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా కళ్యాణ్ తో పెళ్లి జరిపించాడు. ఇక ఆ పెళ్లి కేవలం ఫ్యామిలీ  మెంబెర్స్, కొంతమంది బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవం గా జరిపించాడు. పెళ్ళైతే ఫ్యామిలీతో కానిచ్చేశాడు కానీ రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా పోలిటికల్ ఫ్రెండ్స్ ని, సినిమా ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ ని ఆహ్వానించి హైదరాబాద్ లో ఒక రేంజ్ లో చేసాడు. ఇక శ్రీజ, కళ్యాణ్ చిన్నప్పటి నుండి  స్నేహితులు గనక వారిద్దరి మధ్యన చక్కని అనుభందం ఏర్పడిందని శ్రీజ పాత పెళ్లి జ్ఞాపకాలు మర్చిపోయి ఫుల్ ఖుషి గా ఉందని అంటున్నారు.

ఇకపోతే శ్రీజ మొదటి భర్త శిరీష్  మాత్రం మాజీ మామ చిరు కాంగ్రెస్ లో ఉంటే తాను దాని అపోజిట్ పార్టీ బీజేపీలో జేరి అక్కడ ఎదగడానికి దారులు వెతుక్కుంటున్నాడు. ఇక శిరీష్ కూడా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడట. అసలు శ్రీజ రెండో పెళ్ళికి ముందే శిరీష్ ఒక పెద్ద బిజినెస్ మాన్ కూతుర్ని పెళ్లాడాల్సి ఉందట. కానీ యేవో కారణాల వల్ల ఆ పెళ్లి పోస్ట్ పోన్ అవ్వడం తో ఇప్పుడు మళ్ళీ ఆ పెళ్లి  జరగబోతుందని శిరీష్ సన్నిహితులు చెబుతున్నారు. ఇక తొందరలోనే శిరీష్ పెళ్లి ఆ బడా వ్యాపార వేత్త కూతురుతో జరగబోతోందని సమాచారం. ఇప్పటికే  శ్రీజ రెండో  పెళ్లి చేసేసుకుని ఆమె ఒక ఇంటిదై పోయింది. ఇక శిరీష్ మాత్రం అలా ఒంటరిగా మిగిలిపోయాడనుకునే వాళ్లకి ఈ పెళ్లి వార్త ఒక మంచి వార్త అనిపిస్తుంది కదా!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ