ఇటీవల దర్శకుడు సుకుమార్ తానే నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్స్ అనే బేనర్‌లో 'కుమారి 21 ఎఫ్' చిత్రాన్ని నిర్మించి పెద్ద హిట్ కొట్టాడు. ఇదే ప్లాన్‌లో ఇతర దర్శకులు కూడా నడవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తాను తీసిన చిత్రాలతో పాటు రాధాకృష్ణ నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని బేనర్‌లో త్రివిక్రమ్‌కు వాటా ఉందనే ప్రచారం జరుగుతున్నదే. ఇక అఫీషియల్‌గా త్రివిక్రమ్ త్వరలో ఓ బేనర్‌ను స్దాపించనున్నాడనే వార్తలు వస్తున్నాయి. కాగా త్రివిక్రమ్ నిర్మాతగా రచయిత కృష్ణచైతన్య డైరెక్షన్‌లో ఓ చిత్రం రూపొందించనున్నాడట. ఈ చిత్రానికి ముందు కృష్ణచైతన్య.. నారారోహిత్‌తో 'రౌడీఫెలో' చిత్రం చేసిన సంగతి తెలిసిందే. కాగా కృష్ణచైతన్య తన స్టోరీతో ఆల్‌రెడీ నితిన్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి త్రివిక్రమ్ నిర్మాతగా వ్యవహిరిస్తున్నాడు. ఇక లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో 'పెళ్లిచూపులు' హీరో విజయ్ దేవరకొండ దర్శకత్వంలో త్రివిక్రమ్ మరో చిత్రం నిర్మించనున్నాడు. ఇక మూడో చిత్రంగా ఈ మాటల మాంత్రికుడు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఓ చిత్రం తీయనున్నాడు. మరి ఈ చిత్రాన్ని ఆయన ఏ హీరోతో చేస్తాడు? అనే క్లారిటీ రావడం లేదు. మరి నిర్మాతగా త్రివిక్రమ్ ఏమేరకు సక్సెస్ అవుతాడో వేచిచూడాల్సివుంది.