Advertisementt

అఖిల్‌కు ఇప్పుడప్పుడే యోగం లేదు!

Fri 14th Oct 2016 11:06 PM
akhil akkineni,akhil movie,vikram k kumar,december,nagarjuna  అఖిల్‌కు ఇప్పుడప్పుడే యోగం లేదు!
అఖిల్‌కు ఇప్పుడప్పుడే యోగం లేదు!
Advertisement
Ads by CJ

తన మొదటి చిత్రం 'అఖిల్‌' చిత్రంతో తొలి సినిమాలోనే మాస్‌ ఇమేజ్‌పై దృష్టి పెట్టిన అక్కినేని అఖిల్‌ తన రెండో చిత్రం కోసం భారీ గ్యాప్‌ తీసుకున్నాడు. తన తండ్రి నాగార్జున సలహా మేరకు ఆయన తన తర్వాతి చిత్రాన్ని లవ్‌స్టోరీగా చేయాలని ఫిక్స్‌ అయ్యాడు. డైరెక్టర్‌ కూడా విక్రమ్‌ కె.కుమార్‌ అని అనౌన్స్‌ అయింది. కాగా ఈ చిత్రం మొదట అక్టోబర్‌లో మొదలెడతారనే వార్తలు వచ్చాయి. అయితే సెప్టెంబర్‌లోనే పెళ్లి చేసుకున్న దర్శకుడు విక్రమ్‌ కుమార్‌కు కాస్త గ్యాపిచ్చారు. ఆ తర్వాత ఈ చిత్రం స్క్రిప్ట్‌పై విక్రమ్‌ వర్క్‌ చేయనున్నాడు. మొత్తానికి ఫుల్‌ బౌండెడ్‌ స్క్రిప్ట్‌ డిసెంబర్‌లో పూర్తవుతుందని సమాచారం. ఇక ఈ సినిమా వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత పట్టాలెక్కనుందని తెలుస్తుంది. మొత్తానికి అఖిల్‌ రెండో చిత్రం కోసం మరింతగా గ్యాప్‌ తీసుకోవడంతో అభిమానులు నిరాశపడుతున్నారు. తప్పదు కదా....మరి ఈ రెండో చిత్రమైనా అఖిల్‌కు భారీ హిట్టును ఇస్తుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది. ఒకవైపు నాగార్జున 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన 'మనం, సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి' వంటి చిత్రాలతో బిజీగా సెలక్టివ్‌గా ఉన్నాడు. మరోవైపు మొదటి కుమారుడు నాగచైతన్య ప్రస్తుతం 'ప్రేమమ్‌' ఘనవిజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇక మిగిలింది అక్కినేని అఖిలేనని అర్దమవుతోంది. విక్రమ్‌ కె.కుమార్‌తో చిత్రం అంటే ఈ చిత్రం ఖచ్చితంగా వెరైటీగా, క్యూట్‌ లవ్‌స్టోరీగా రూపొందనుందనే ఆశలతో అక్కినేని అభిమానులు వెయిట్‌ చేసి చూస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ