చిరంజీవి 150 చిత్రం 'ఖైదీ నెంబర్ 150' లో సడన్ గా ఐటెంసాంగ్ లో చేసే హీరోయిన్ ని మార్చేశారు. అసలు ఈ సాంగ్ లో చిరుకి జోడిగా కేథరిన్ నటించాల్సి వుంది. ఇకపోతే ఈ సాంగ్ షూటింగ్ ని కూడా స్టార్ట్ చేసేసారు. అయితే షూటింగ్ స్టార్ట్ అయిన రోజే కేథరిన్ ని తప్పించేసారు చిత్ర యూనిట్ వాళ్ళు. దీనికి కారణం కేథరిన్.. చిరంజీవి ఫ్రెండ్, డాన్స్ మాస్టర్ అయిన లారెన్స్ తో గొడవపడడమే అని చెబుతున్నారు. ఇక కేథరిన్.. లారెన్స్ చెప్పిన మూమెంట్స్ గాని, స్టెప్స్ గాని సరిగ్గా చెయ్యకుండా గొడవకు దిగిందని అన్నారు. ఇక అటు కేథరిన్ ని తప్పించగానే వెంటనే మరో హీరోయిన్ లక్ష్మి రాయ్ ని సెలక్ట్ చేసేసారు ఖైదీ నెంబర్ 150 చిత్ర యూనిట్ వాళ్ళు. ఇంకేముంది ఇప్పటికే తమ్ముడు పవన్ తో 'సర్దార్ గబ్బర్ సింగ్' లో ఐటెం పాప గా ఆడి పాడిన ఆమెకు ఇప్పుడు అన్న చిరు పక్కన కూడా ఛాన్స్ రావడం తో లక్ష్మి రాయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇదిలా ఉంటే కేథరిన్ తప్పించడానికి కారణం లారెన్స్ కాదని వేరే కారణం ఉందని అంటూ ఒక న్యూస్ ప్రచారం లోకి వచ్చింది. అదేమిటంటే చిరంజీవి 150 చిత్రానికి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా చిరు పెద్ద కూతురు సుస్మిత పని చేస్తుందని అందరికి తెలుసు. ఆమె ఈ సినిమాకి సంబంధించి అందరి డ్రెస్సులను డిజైన్ చెయ్యడానికి తన ఫ్రెండ్ సహాయం తీసుకుంటుందట. అయితే స్పెషల్ షూట్ లో జాయిన్ అవడానికి వచ్చిన కేథరిన్.. సుస్మిత స్నేహితురాలితో గొడవ పెట్టుకుందని అంటున్నారు. ఆమె డిజైన్ చేసిన డ్రెస్ కేథరిన్ కి నచ్చలేదని అందుకే ఆమె తో గొడవ పడిందని అంటున్నారు. ఇక కేథరిన్ ని సుస్మిత ఎంత సముదాయించినా అస్సలు కేథరిన్ వినే పరిస్థితిలో లేకపోవడం వల్లనే ఆమెను ఈ ఐటెం సాంగ్ నుండి తప్పంచినట్లు చెబుతున్నారు. మరి మెగా డాటర్ తో పెట్టుకుంటే ఊరుకుంటుందా... అందుకే పీకిచ్చి పడేసిందని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.