ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా అధ్యక్ష పోటీపై మాట్లాడుతూ భారతదేశం నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చే దేశమని, అమెరికా వంటి దేశాలలో అలా ఉండదని, వారు ఎన్నెన్ని పెళ్లిళ్లు చేసుకుంటారో తెలియదని, ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ట్రంప్‌కు ఇప్పుడున్నావిడ నాలుగో పెళ్లాం అనే అర్దం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు. కానీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పవన్‌కు, చంద్రబాబుకు తలనొప్పి అయి కూర్చున్నాయి.. జనసేన అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కు ఇప్పుడున్నావిడ నాలుగో భార్య అని ఆయన్ను ఉద్దేశించే బాబు ఇన్‌డైరెక్ట్‌గా ఈ వ్యాఖ్యలు చేశారని పవన్ వ్యతిరేకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చంద్రబాబు ట్రంప్‌ను గురించి చేసిన వ్యాఖ్యలకు పవన్‌కు సంబంధం లేదు గానీ చంద్రబాబు మాటలు మాత్రం ఇప్పుడు పవన్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. పెళ్ళిళ్ళను చూసి మనిషి వ్యక్తిత్వాన్ని పోల్చలేమని, పెళ్ళిళ్ళ మీద పెళ్లిళ్లు చేసుకుంటున్నవారిలో మంచి వారు లేరా?! ఎంతటి ప్రత్యర్దులు అయినా సరే వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయడం మంచి పద్దతి కాదని మెజార్టీ ప్రజల అభిప్రాయం. మరి చినికి చినికి ఈ గాలివాన ఉధృతం అయ్యేలా పరిస్దితులు కనిపిస్తున్నాయి.