తెలుగు లో టాప్ సెలెబ్రిటీ స్టేటస్ అనుభవించి, ఆ తర్వాత దారుణంగా పడిపోయిన హీరోయిన్ లలో శ్రియ ఒకరు. గత కొంతకాలంగా ఆమె పరిస్థితి ఏమిటో అందరికి తెలిసిందే. అలా అని ఆమె డీలా పడిపోకుండా తన ప్రయత్నాలు తాను చేస్తూనే వుంది. ఆమె ప్రయత్నాలు ఫలించి ఇప్పుడు బాలకృష్ణ పక్కన 'గౌతమీపుత్ర శాతకర్ణి' లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి మళ్ళీ బిజీ అయిపొయింది. ఇక కెరీర్ మొదలెట్టినప్పటి నుండి ఆమె అందాలు అలానే వన్నె తగ్గకుండా ఇప్పటికి అలానే వున్నాయి.
అయితే శ్రీయ ఇప్పటివరకు ప్రేమ, పెళ్లి అనే కబుర్లు చెప్పలేదు. ఆ మధ్య రానా తో పెళ్లి అంటూ రూమర్ ఒకటి వచ్చిన వెంటనే జాగ్రత్త పడింది శ్రియ. ఆ తర్వాత ఆమెపై పెద్దగా రూమర్స్ రాలేదనే చెప్పుకోవాలి. ఇక అలాంటి శ్రీయ ఇప్పుడు ఒక వ్యక్తితో ప్రేమలో ఉందని అంటున్నారు. అతను ఒక స్టార్ క్రికెటర్ అంట. ఆ క్రికెటర్ తో శ్రీయ పీకల్లోతు ప్రేమలో ఉందని సోషల్ మీడియా లో ఒకటే ప్రచారం జరుగుతుంది. ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదంట. అతను వెస్టిండీస్ స్టార్ అల్ రౌండర్ బ్రావో అట.
ఇక బ్రావో తో ఎక్కడికి బడితే అక్కడికి శ్రీయ తిరుగుతుందని.... వీరిద్దరూ డేట్ లో వున్నారని అంటున్నారు. అసలు బ్రావో తో శ్రీయ కి ఎలా పరిచయమైందో గాని శ్రీయని లవ్ చెయ్యడం మొదలెట్టినప్పటినుండి బ్రావో ఎక్కువగా ఇండియాలోనే తిరుగుతున్నాడట. బ్రావో వయసు 33 కాగా శ్రీయ కి 34. అయినా ప్రేమకు వయసుతో అసలు పనిలేదుగా అందుకే వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని ముంబై లో ఒక హోటల్ లో తిరుగుతూ మీడియా కంటికి చిక్కారట. ఇంకేముందు ఈ న్యూస్ సోషల్ మీడియాలో గుప్పుమంది. అయితే ఈ న్యూస్ గురుంచి ఇప్పటిదాకా అటు శ్రీయ గాని ఇటు బ్రావో గాని స్పందించలేదు. మరి వీరి నడుమ ప్రేమ ఉందొ లేక ఇంకేమైనా ఉందో ఎవరికీ తెలుసు అనే అర్ధాలు తీస్తున్నారు వీరి వ్యవహారం గురించి.