Advertisementt

దీపావళి మనదే అంటోన్న మహేష్..!

Fri 14th Oct 2016 06:50 PM
mahesh babu,vijaya dasami,deepavali,mahesh babu and murugadoss movie,kollywood  దీపావళి మనదే అంటోన్న మహేష్..!
దీపావళి మనదే అంటోన్న మహేష్..!
Advertisement
Ads by CJ

మహేష్ విజయదశమికి తన కొత్త సినిమా టీజర్ తో నైనా లేక ఆ సినిమా టైటిల్ ని అయినా విడుదల చేస్తాడని అభిమానులు ఎంతగానో ఎదురు చూసారు. కానీ మహేష్ కి సంబంధించి ఒక్క టీజర్ గాని లేక టైటిల్ కి  సంబంధించి ఒక్క న్యూస్  కూడా బయటికి రాలేదు. అయితే మహేష్.. అభిమానులను నిరాశ పరచకుండా వచ్చే దీపావళికి తన సినిమా కి సంబంధించి ఒక టీజర్ ని విడుదల చెయ్యడానికి అన్ని సిద్ధం చేస్తున్నాడని సమాచారం. ఎందుకంటే మహేష్ సినిమా మురుగదాస్ డైరెక్షన్ లో అటు తమిళం లోను, ఇటు తెలుగులోనూ తెరకెక్కిస్తున్నారు. ఇక తమిళంలో దీపావళి పెద్ద పండగ కాబట్టి... అందుకే మహేష్ చిత్ర టీజర్ ని అప్పుడు విడుదల చేయాలని మురుగదాస్ భావించాడట.

ఎలాగూ ఈ దసరాకి  బాలకృష్ణ తన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' టీజర్ తో అభిమానులను అలరించగా.... రామ్ చరణ్ కూడా తన 'ధృవ' సినిమా టీజర్ తో మెగా అభిమానులను ఖుషి చేసాడు. అందుకే సందట్లో సడేమియా లా ఎందుకు అనుకున్నాడేమో మురుగదాస్ ఇలా సోలోగా రావాలని ప్లాన్ చేసాడు. ఎలాగూ తెలుగు, తమిళ్ లో దీపావళి అందరూ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటారు కాబట్టి అప్పుడే ఈ టీజర్ ని రిలీజ్ చెయ్యడానికి మురుగదాస్ ప్లాన్ చేసాడన్నమాట. ఇక మహేష్ అభిమానులు ఈ దసరా పండక్కి  కొద్దిగా నిరాశపడ్డా... దీపావళికి సెలెబ్రేట్ చేసుకోవడానికి రెడీ అయిపోవచ్చన్నమాట. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం పూర్తయిందని..... ఇక దీపావళికి రిలీజ్ చేసే టీజర్ కి సంబంధించి కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారని అంటున్నారు. ఇక ఈ చిత్రం లో మహేష్ కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ