Advertisementt

దేశభక్తి చాటుతున్న గుజరాత్‌ వ్యాపారులు!

Fri 14th Oct 2016 05:15 PM
gujarat,pakistan,vegetables,mirchi powder,soldiers  దేశభక్తి చాటుతున్న గుజరాత్‌ వ్యాపారులు!
దేశభక్తి చాటుతున్న గుజరాత్‌ వ్యాపారులు!
Advertisement
Ads by CJ

తీవ్రవాదులను చేరతీసి వారికి తమ ప్రోత్సాహం అందిస్తూ భారత్‌ సైనిక వీరుల మరణాలకు కారణం అవుతోన్న పాకిస్దాన్‌ విషయంలో కేవలం తమ స్వలాభం కోసం చూసుకోకుండా తమ వ్యాపారం తగ్గినా ఫర్వాలేదని, కానీ పాక్‌ను తమ చర్యల ద్వారా సత్తా చాటాలని గుజరాత్‌లోని వ్యాపారులు కూరగాయలు, ముఖ్యంగా టమోటాలు, కారం వంటి వాటిని పాకిస్దాన్‌కు విక్రయించకూడదని నిర్ణయానికి వచ్చారు. గుజరాత్‌ నుండి వాఘా సరిహద్దు ద్వారా రోజులో ఎన్నో కోట్ల విలువైన కూరగాయలు, కారం వంటివి పాకిస్తాన్‌ వెళ్తాయి. పాక్‌లో ప్రస్తుతం కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాగా గుజరాత్‌లోని వ్యాపారులందరూ ఇప్పుడు పాక్‌కు బుద్ది చెప్పాలనే లక్ష్యంతో తీసుకున్న ఈ చర్య కాస్తా బాధాకరమే అయినా మన గుజరాత్‌ వ్యాపారస్దుల సహాయనిరాకరణ సాధిస్తుండటం ఎంతో హర్షణీయమే అంటున్నారు. కారం, టమోటాలు లేక పాకిస్దాన్‌ను ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడే కొట్టి గుజరాత్‌ వ్యాపారస్తులు తమ దేశభక్తిని చాటుకుంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ