హీరోగా రామ్‌కు మంచి స్దాయి ఉంది. రామ్ ని అభిమానించే అభిమానులు చాలా మందే వున్నారు. అయితే ప్రస్తుతం నాగచైతన్య హీరోగా 'ప్రేమమ్' చిత్రం అదరగొడుతోంది. వాస్తవానికి రామ్ 'నేను.. శైలజ' చిత్రం తర్వాత హైపర్ చిత్రం చేశాడు. కానీ ఈ చిత్రం అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. కాగా ఈ చిత్రానికి ముందు ఆయన పెద్దనాన్న 'స్రవంతి' రవికిషోర్ రామ్ కోసం తమిళంలో హిట్టయిన 'రఘువరన్ బి.టెక్' తో పాటు మలయాళ 'ప్రేమమ్' చిత్రాల రీమేక్‌లను రామ్‌తో చేయాలని భావించాడు. కానీ రెండు మంచి అవకాశాలను పోగొట్టుకుని ఇప్పుడు రామ్ 'హైపర్'తో డల్ అయ్యాడు. స్రవంతి రవికిషోర్ అభిరుచిని తెలియజేసేలా ఆయన నిర్మించే చిత్రాలు ఉంటాయి. కానీ ఈ రెండు చిత్రాల విషయంలో మాత్రం రామ్ రాంగ్ స్టెప్ వేశాడు. 'రఘువరన్ బి.టెక్' ఓ డబ్బింగ్ చిత్రంగా, 'ప్రేమమ్' నాగచైతన్యతో రీమేక్‌గా విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంటోంది. మరి రామ్ మనసులో అసలేముంది? కేవలం యాక్షన్ చిత్రాలే తనకు ఊపునిస్తాయని ఆయన భ్రమ పడితే మాత్రం ఆయనను ఎవ్వరు కాపాడలేరు. రామ్ పోకడ చూసి.. స్రవంతి రవికిషోర్ లాంటి నిర్మాత సలహాలు వింటే సరే.. లేకుంటే రామ్ ఎంత స్పీడ్‌గా ఎదిగాడో... అలాగే పడిపోవటం ఖాయమని ఫిల్మ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.