Advertisementt

సింప్లిసిటీనా? లేక పబ్లిసిటీ కోసమా.!

Fri 14th Oct 2016 02:50 PM
oommen chandy,kerala former cm,simplicity,publicity  సింప్లిసిటీనా? లేక పబ్లిసిటీ కోసమా.!
సింప్లిసిటీనా? లేక పబ్లిసిటీ కోసమా.!
Advertisement

ఒక్కరోజు సీఎంగా ఉన్నవారే ఆ తర్వాత తమకు పదవులు లేకపోయినా లగ్జరీలైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంటారు. ఈ కాలంలో స్దానిక కార్పొరేటర్లే తమ ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ సౌకర్యాలను అనుభవిస్తూ, కోట్లకు కోట్లు ఖర్చుచేస్తున్నారు. కానీ కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్‌ చాంది మాత్రం తాను ఇప్పటికీ ఎప్పటికీ సాధారణ జీవితం గడపడమే తనకు ఇష్టం అంటున్నాడు. ఆయన సాదాసీదా ప్రయణకునిలా సాధారణ స్లీపర్‌ క్లాస్‌లో ప్రయాణించాడు. ఆయనను తోటి యాత్రికులు మొదట గుర్తించలేదు. ఆ తర్వాత చాలా సేపటికి ఆయన్ను గుర్తుపట్టారు. ఆయన తిరువంతపురం వరకు 160కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాడు. ఈ విషయం మీడియాలో ప్రచారం కాబట్టి ఈ ఉదంతం బయటికి పొక్కింది. ఈ ఉదంతం గురించి ఉమెన్‌చాందీని ప్రశ్నిస్తే... తనకు దూర ప్రాంతాలకు స్లీపర్‌ క్లాస్‌ అయితే బాగుంటుందని, తనకు ప్రజలతో కలిసి ఉండలేకపోతే ఒంటరిగా బాధపడతానన్నాడు. మొత్తానికి ఉమెన్‌చాందీ ప్రయాణం ఇప్పుడు అందరిని మరీ ముఖ్యంగా సోషల్‌మీడియాలో ఉమెన్‌ చాందీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనిని ఆయన ప్రత్యర్దులు మాత్రం తప్పుపడుడున్నారు. ఇలాంటి వ్యవహారాలు పబ్లిసిటీ యావతో చేసేవని ఆయన వ్యతిరేక పక్షాల నాయకులు అంటున్నారు. అయితే ఆయన సీఎంగా దిగిపోయిన వారం రోజులకే రైలులో టిక్కెట్లు లేకపోవడంతో సాధారణ బస్సులో సైతం ప్రయాణించిన విషయం గమనిస్తే ఆయన చేసింది కేవలం తన సింప్లిసిటీకేనని ఒప్పుకోవాల్సిందే అంటున్నారు ఆయన అభిమానులు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement