Advertisementt

ఈ మూవీ నిజంగా నాగ్ ఒప్పుకున్నాడా?

Thu 13th Oct 2016 11:46 PM
nagarjuna,raju gari gadhi sequel,ohmkar,venkatesh  ఈ మూవీ నిజంగా నాగ్ ఒప్పుకున్నాడా?
ఈ మూవీ నిజంగా నాగ్ ఒప్పుకున్నాడా?
Advertisement
Ads by CJ

ప్రముఖ రియాలీటీ షోల యాంకర్‌గా పేరు తెచ్చుకున్న ఓంకార్‌ తన రెండో చిత్రంగా అతి తక్కువ బడ్జెట్‌తో 'రాజుగారి గది' చిత్రం చేసి రూపాయికి రూపాయి ఆదాయం సాధించి కాసుల పంట పండించాడు. కాగా ఓంకార్‌ తాజాగా ఈ 'రాజుగారి గది'కి సీక్వెల్‌ను తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు. అలా చేస్తే అందులో నటించడానికి విక్టరీ వెంకటేష్‌ ఒప్పుకున్నాడనే ప్రచారం జరిగింది. కాగా ఇలాంటి చిత్రాలకు, మరీ ముఖ్యంగా సీక్వెల్స్‌ను మన ప్రేక్షకులు బాగా ఆదరించిన ఘటనలేమీ పెద్దగా లేవు. 'చంద్రముఖి'వంటి చిత్రానికి సీక్వెల్‌గా చేసిన 'నాగవళ్లి' చిత్రాన్ని వెంకీనే చేసినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద దారుణమైన ఫలితాలను రాబట్టడం గమనార్హం. మరి ఎందుకనో ఈ చిత్రం నుండి వెంకటేష్‌ తప్పుకున్నాడని, ఆ స్ధానంలో నాగార్జున ఈ చిత్రంలో నటింంచనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 'మనం, ఊపిరి, సోగ్గాడే చిన్నినాయనా' వంటి విజయాలతో దూసుకెళ్లుతోన్న కింగ్‌ నాగార్జున ఈ సీక్వెల్‌లో నటించున్నాడని, ఈ చిత్రానికి కూడా ఓంకారే దర్శకత్వ భాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇదే జరిగితే ఓంకార్‌ బంపర్‌ ఆఫర్‌ కొట్టాడనే అనుకోవాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ