బాలయ్య కూతురు, నారా వారి కోడలు అయిన బ్రాహ్మణి పార్టీలకు సంబంధంలేని ఓ సర్వే కంపెనీ చేత ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరి స్దితి ఏమిటనేది గుట్టుగా సర్వే చేయించిందని సమాచారం. ఈ సర్వేలో బోలెడు విషయాలు బయటపడ్డాయి. ఈ ఫలితాలను చూసి చంద్రబాబు అదిరిపోయాడట. రాష్ట్రంలోని 175 నియోజక వర్గాల్లో సర్వే చేయించింది బ్రాహ్మణి. దీని ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిడిపికి 57 సీట్లు కూడా రావని రిపోర్ట్ బహిర్గతం చేసింది. తెలుగుదేశం, బిజెపిలు జతకట్టినా కూడా 57 సీట్లు కూడా రావని, మిగిలిన సీట్లు విపక్షాలకు వెళ్తాయని ఈ సర్వే తేల్చింది. అయితే ఇతర పక్షాలకు ఓట్లు మారే విషయం ఖరారైంది కానీ ఈ ఓట్లు వైయస్సార్‌సీపీకి వెళ్లతాయా? లేక పవన్ జనసేనతో ముందుకొచ్చే సమయంలో ఆయనకు ఎన్ని సీట్లువస్తాయి? వంటి కీలక రహస్యం మాత్రం బ్రాహ్మణికి మాత్రమే తెలియాలి అంటున్నారు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడం, రాజధాని విషయంపై తీవ్ర జాప్యం, విపరీతంగా పెరిగిపోయిన అవినీతి వంటి వాటివల్ల చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగులుతుందని, అదే సయమంలో ప్రత్యేకహోదా విషయంలో సైతం ప్రజలు టిడిపిని, బిజెపిని శత్రువల వలే చూస్తున్నారని, ఆ విషయంలో ప్రజలు బిజెపితో పాటు టిడిపి వైఖరిని కూడా తప్పుపడుతున్నారన్నది తెలిసిపోతోంది. ఈ విషయంలో రాజకీయ విశ్లేషకులు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.